ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గస్థాయి సమావేశం నేడు తెలంగాణ భవన్లో నిర్వహించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఖమ్మం వంటి ఒకటి.. రెండు జిల్లాల్లో తప్పితే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదు అనడానికి మనం సాధించిన ఫలితాలే నిదర్శనమన్నారు. 39 ఎమ్మెల్యే సీట్లను గెలవడంతో పాటు 11 స్థానాలు అత్యల్ప మెజారిటీ తో చేజారిపోయాయని, ఇంకా కొన్ని చోట్ల మరికొన్ని కారణాలచేత కోల్పోయామన్నారు. ప్రజల్లో…
భారత్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మంగళవారం దేశంలో 475 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 3,919 యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 6గురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రంలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రాజకీయ పార్టీలు సీఈసీ వద్దకు క్యూ కట్టాయి. వైసీపీ-టీడీపీ పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. వైసీపీ ఆరు అంశాలతో.. టీడీపీ-జనసేన ఎనిమిది అంశాలతో పరస్పరం ఫిర్యాదులు చేశాయి. కాగా.. నిబంధనల ప్రకారం వచ్చే ఎన్నికల్లో జనసేనకు గాజు గుర్తు కేటాయించకూదనే కీలకాంశాన్ని వైసీపీ తెర పైకి తెచ్చింది. మరోవైపు.. టెక్నాలజీతో ఓటర్ల యాప్ రూపొందించి అవకతవకలకు పాల్పడుతోందంటూ టీడీపీపై వైసీపీ ఫిర్యాదు చేసింది.
ఎస్సీల స్థితి గతులను అధ్యయనం కోసం జస్టిస్ బాల కిషన్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీకి రాష్ట్రంలో పర్యటిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలని కమిటికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. ఈ విషయంపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయాన్ని కమిటి దృష్టికి తీసుకుని వెళ్లామని పేర్కొన్నారు. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభ్యున్నతి కోసం చేస్తున్న కృషిని వివరించామన్నారు మంత్రి.
కొత్త ఏడాది వేళ జపాన్ను వరుస భూకంపాలు వణికించిన సంగతి తెలిసిందే. ఆ భూకంపం నుంచి జపాన్ వాసులు తేరుకోకముందే ఆ దేశంలో మరోసారి భారీ భూకంపం సంభవించింది. సెంట్రల్ జపాన్లో 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.0గా నమోదైనట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది.
హైదరాబాద్లో ఈ రోజు సచివాలయంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుని వారి కార్యాలయంలో రైతు ప్రతినిధులు పలువురు కలిసి వివిధ అంశాలపై చర్చించారు. ప్రధానంగా రైతుబంధు అమలు, ధరణి పోర్టల్ సమస్యలు, రైతులకు సాయిల్ హెల్త్ కార్డ్స్, రుణమాఫీ, కౌలు రైతులకు పెట్టుబడి సాయం, కల్తీ విత్తనాలు, ఎరువులను ఏ విధంగా అరికట్టాలి, సేంద్రియ ఎరువులు, బహుళ అంతస్తుల వ్యవసాయ పద్దతులు, డ్రిప్, చిరు ధాన్యాల సాగు తో పాటు ప్రాసెసింగ్, మామిడి తదితర పండ్ల ప్రాసెసింగ్,…
తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి ఎమ్మెల్యే పద్మావతి ఎపిసోడ్ చేరుకుంది. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.. రెండు రోజుల కిందట ప్రభుత్వ తీరును తప్పుబడుతూ ఫేస్బుక్ లైవ్ ఇచ్చింది. దీంతో.. పద్మావతి వ్యవహార శైలిపై హైకమాండ్ సీరియస్ గా ఉంది. ఈ క్రమంలో.. ఆమేకు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో, తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి.
లక్షదీవులను భారతదేశంలోని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఇదిలావుండగా.. మినీకాయ్ దీవులలో కొత్త విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయాలని భారత్ యోచిస్తోంది. ఇది యుద్ధ విమానాలతో సహా వాణిజ్య విమానాలతో పాటు సైనిక విమానాలను కూడా నిర్వహించగలదు.
ఎమ్మెల్యే పార్థసారథి ఎపిసోడ్ కొలిక్కిరాలేదు. మరోసారి సారథితో రీజనల్ కోఆర్డినేటర్ అయోధ్య రామిరెడ్డి భేటీ చర్చలు జరిపారు. 30 నిమిషాలు పాటు వారు చర్చించారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు అయోధ్య రామిరెడ్డి. కాగా.. నిన్న సీఎం జగన్తో ఎమ్మెల్యే పార్థసారథి సమావేశమైన విషయం తెలిసిందే. అయినా సారథిలో అసంతృప్తి తగ్గనట్లుగా కనిపిస్తోంది. అయితే.. వచ్చే ప్రభుత్వం కేబినెట్ బెర్త్ పై హామీ కోసం సారథి పట్టుబడుతున్నట్లు సమాచారం. సారథితో జరిపిన చర్చల సారాంశాన్ని అయోధ్య…
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నమో యాప్ వికసిత్ భారత్ అంబాసిడర్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు వికసిత్ భారత్ అంబాసిడర్ గా మారాలన్నారు. నేను సైతం అన్నట్లు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని, 1990లో అద్వాని సారథ్యంలో అయోధ్యలో రామాలయం నిర్మించాలని బీజేపీ పాలమూరులో తీర్మాణం చేసిందన్నారు కిషన్ రెడ్డి. అద్వాని రథయాత్ర చేపడితే దేశమంతా…