కర్నూలు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. మంత్రాలయం నియోజకవర్గం పెదకడుబూరులో "నిజం గెలవాలి" యాత్రలో ఆమె పాల్గొన్నారు. అందులో భాగంగా.. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెనొప్పితో చనిపోయిన గోనేభావి గోపాల్ కుటుంబాన్ని పరామర్శించి, అతని చిత్ర పటానికి నివాళులు అర్పించారు. అనంతరం.. అతని కుటుంబానికి రూ. 3 లక్షలు ఆర్థిక సహాయం అందించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక గుండెపోటుతో కార్యకర్తలు మరణించడం బాధాకరమన్నారు. కార్యకర్తల మృతితో చంద్రబాబు ఎంతో బాధపడ్డారని.. ప్రతి…
జార్ఖండ్కు చెందిన 85 ఏళ్ల వృద్ధురాలు తన మూడు దశాబ్దాల మౌనవ్రతాన్ని జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించడంతో విరమించనున్నారు. అయోధ్య రామమందిర నిర్మాణాన్ని ఆమె తన కలగా భావించింది. తన కల నెరవేరేవరకు మౌనవ్రతాన్ని పాటిస్తానని ఆమె ప్రతిజ్ఞ చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 'రా కదలిరా' సభలో పాల్గొన్నారు. ఈ సభకు భారీగా కార్యకర్తలు, జనాలు రావడంతో.. చంద్రబాబు ఉత్సాహంగా ప్రసంగించారు. అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ జనాన్ని చూసి తాడేపల్లి పిల్లి వణికిపోతోందని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజలు పివి నరసింహారావును పార్లమెంట్ కి పంపితే ఆర్థిక సంస్కరణలు అమలు చేశారని తెలిపారు. పివి నరసింహారావు దేశానికి దశ దిశ చూపించారని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా.. ఎన్టీఆర్ జనవరి…
జరిగిన ఆర్థిక అరాచకత్వం – కొద్ది మంది ప్రయోజనాలు, ప్రాపకం కోసం చేసిన వాటిని సరిచేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ – రేసింగ్ వల్ల ఒకరు టికెట్లు అమ్ముకున్నారు, మరొకరు రేసింగ్ చేసుకున్నారు మరి ఇన్ఫ్రాసట్రక్చర్ ఇచ్చిన రాష్ట్రానికి ఆదాయం సున్నా అన్నారు భట్టి. ఈ ఫార్ములా ట్రై పార్టీ రేసింగ్ ను – బై పార్టీ రేసింగ్ గా మార్చారని ఆయన వ్యాఖ్యానించారు. టికెట్లు అమ్మేవాళ్లు, రేసింగ్…
ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 34 ఏళ్ల విద్యా శాఖ మంత్రి గాబ్రియేల్ అట్టల్ను మంగళవారం తన కొత్త ప్రధాన మంత్రిగా నియమించారు. దేశ ప్రధాని పోస్టుకు తొలిసారిగా గే (స్వలింగ సంపర్కుడు) వర్గానికి చెందిన 34 ఏళ్ల గాబ్రియేల్ అట్టల్ పేరును మంగళవారం ప్రతిపాదించారు.
మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగిపోవడం అంశంపై విజిలెన్స్ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని ప్రకటించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మేడిగడ్డ నుంచి హైదరాబాద్ వరకు ఉన్న పది నీటి పారుదల కార్యాలయాలలో విజిలెన్స్ అధికారుల విస్తృత తనిఖీలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం మేడిగడ్డ విషయంలో సీరియస్ గా స్పందించిందన్నారు. మేడిగడ్డ, కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మేడిగడ్డ వద్ద పూర్తి సమాచారంతో పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ అధికారులతో ఇచ్చిందన్నారు. మేడిగడ్డలో జరిగిన…
బెజవాడలో కేశినేని భవన్ కు ఉన్న టీడీపీ, చంద్రబాబు ఫ్లెక్సీలు తొలగించారు. టీడీపీ, చంద్రబాబు ఇతర నేతల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు తీసేశారు సిబ్బంది. కేవలం.. కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు మాత్రమే ఉంచారు. కేశినేని పార్టీ మారుతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ, చంద్రబాబు ఫోటోలతో ఉన్న ఫెక్లీలను తొలగించారు.
ప్రముఖ సంగీత విద్వాంసుడు ఉస్తాద్ రషీద్ ఖాన్(55) క్యాన్సర్తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. క్యాన్సర్ కారణంగా చాలా కాలంగా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నివేదిక ప్రకారం, డిసెంబరులో సెరిబ్రల్ అటాక్కు గురైన తర్వాత ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈ క్రమంలోనే మొదట టాటా మెమోరియల్ క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.
అనంతపురంలో సామాజిక సాధికార బస్సు యాత్ర కొనసాగుతుంది. ఈ కార్యక్రమంలో ఎంపీ నందిగామ సురేష్, పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనకు.. 4 ఏళ్ల వైఎస్ జగన్ పాలనకు ఎంతో తేడా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు మంచి చేసే నైజం సీఎం జగన్ కు ఉందని అన్నారు. వెన్నుపోట్లతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. రాజధాని అమరావతి అవినీతిలో పవన్…
సీఎం క్యాంప్ ఆఫీసుకు కేఏ పాల్.. అపాయింట్మెంట్ ఇస్తే దీవిస్తా.. లేదంటే శపిస్తా..! ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఏది చేసినా కాస్త వెరైటీగానే ఉంటుంది.. అది కాస్తా వైరల్గా మారిపోతుంది.. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసేందుకు చేస్తున్న ప్రయత్నం నవ్వులు పూయిస్తుంది.. ఏపీ పర్యటనలో ఉన్న సీఈసీ రాజీవ్ కుమార్ను కలిసిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పలు సూచనలు చేశారు.. కేంద్ర ఎన్నిక సంఘం ప్రతినిధుల కలసిన తర్వాత…