Gorantla Madhav NBW: మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు షాక్.. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..
- గోరంట్ల మాధవ్ కు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..
- అత్యాచారానికి గురైన మైనర్ బాలిక వివరాలు వెల్లడించినందుకు కేసు..
- మాధవ్ విచారణకు హాజరు కాకపోవటంతో NBW జారీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gorantla Madhav NBW: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు పెద్ద షాక్ తగిలింది. ఆయనపై పోక్సో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. అత్యాచారానికి గురైన మైనర్ బాలిక వివరాలను బహిర్గతం చేశారన్న ఆరోపణలతో గోరంట్ల మాధవ్‌పై గతంలోనే పోక్సో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో విచారణకు గోరంట్ల మాధవ్ హాజరు కాకపోవడంతో విజయవాడలోని పోక్సో కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మహిళా కమిషన్ మాజీ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదైంది. మైనర్ బాలికకు సంబంధించిన సున్నితమైన వివరాలను బహిరంగంగా వెల్లడించడం పోక్సో చట్టానికి విరుద్ధమని అభియోగాలు ఉన్నాయి. ఈ అంశంపై కోర్టు ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ మాధవ్ హాజరు కాకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా, తనపై జారీ అయిన నాన్ బెయిలబుల్ వారెంట్‌ను రీకాల్ చేయాలని కోరుతూ సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు గోరంట్ల మాధవ్ వర్గాలు వెల్లడించాయి. ఈ కేసులో తదుపరి పరిణామాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
Read Also: Tamannaah: బోల్డ్ సీన్లు చేయనందుకు ఆ స్టార్ హీరో నన్ను అవమానించాడు.. తమన్నా ఆవేదన!
Also Read
- Mobile Phone Blast: పిడుగుపాటుకు జేబులో పేలిన సెల్‌ఫోన్.. విద్యుత్ ఉద్యోగి మృతి
- Gummanur Jayaram: ‘రెబల్‌గా వేస్తే సినిమా చూపిస్తా..!’.. టీడీపీ నేతలకు ఎమ్మెల్యే గుమ్మనూరు సీరియస్ వార్నింగ్..
- Vijayasai Reddy: టీడీపీ, వైసీపీకి మూడో ప్రత్యామ్నాయం మేమే.. విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!