హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను మూడు నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. అడ్డంకులన్నీ అధిగమించి, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డు అవతల నిర్మించ తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డు భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్ లో పడింది. భారత్ మాల పరియోజన ఫేజ్ వన్ లో రీజనల్ రింగ్ రోడ్డు (ఉత్తరం) రూ.158.645…
ఏపీలో రాజకీయ సమీకరణాలు రోజు రోజుకు మారుతున్నాయి. వైసీపీ నుంచి టీడీపీకి.. టీడీపీ నుంచి వైసీపీకి నేతలు మారుతున్నారు. ఈ క్రమంలో జగ్గయ్యపేట ఎమ్మెల్యే ఉదయభాను పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చారు. తాను వైసీపీలోనే ఉన్నానని తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోందని.. ఇది తనపై జరుగుతున్న దుష్ప్రచారమని తెలిపారు.
హనుమకొండ జిల్లా హరితహోటల్ లో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియ శ్రీహరి మాట్లాడుతూ.. గత 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ ఉద్యమం జరుగుతుందని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పాసయిందని, ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ ఫైల్ చేయబోతోందన్నారు కడియం శ్రీహరి. అంతేకాకుండా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు లో అఫిడవిట్ ఫైల్ చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ…
నేపాల్ లోని త్రిశూలి నదిలో మంగళవారం తెల్లవారుజామున బాగ్మతి ప్రావిన్స్‌లో భారతీయ నంబర్ ప్లేట్‌తో కూడిన జీపు నదిలో పడిపోయింది. దీంతో నేపాల్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చిత్వాన్ జిల్లాలోని త్రిశూలి నదిలో సాయంత్రం 4.30 గంటల సమయంలో బొలెరో వాహనం పడిపోయిందని ముంగ్లింగ్ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై సోదాలు జరుగుతున్నాయని.. అంతేకాకుండా, ఎవరైనా గల్లంతయ్యారా అనే కోణంలో ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు.. నదిలో పడిపోయిన వాహనం రిజిస్ట్రేషన్…
బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విశాఖలో సంక్రాంతి సంబరాల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. కనుమ రోజున విశాఖ ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఓ రిక్షావాలాను కూర్చోబెట్టుకుని జీవీఎల్ రిక్షా తొక్కారు. సంప్రదాయ పంచెకట్టులో నడుముకు కండువా బిగించి రిక్షా తొక్కారు. తర్వాత.. ఆ రిక్షా కార్మికుడికి కొంత డబ్బులు ఇచ్చారు. అయితే.. దీనికి సంబంధించిన వీడియోను జీవీఎల్ తన ఫేస్ బుక్ అకౌంట్ లో షేర్ చేశారు.
ఈ ఏడాది చివరి నాటికి అయోధ్య, వారణాసి, తిరుపతి, కత్రా-వైష్ణో దేవి వంటి ప్రధాన ఆధ్యాత్మిక ప్రదేశాలలో 400 ప్రాపర్టీలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు హాస్పిటాలిటీ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ ఓయో తెలిపింది. ఆధ్యాత్మిక పర్యాటకంపై ప్రజల్లో పెరుగుతున్న నేపథ్యంలో ఏడాది చివరి నాటికి విస్తరణను చేపట్టనున్నట్లు ఓయో ఓ ప్రకటనలో పేర్కొంది.
నెయ్యి శతాబ్దాలుగా భారతీయ వంటగదిలో రాజుగా ఉంది. దీని రుచి, వాసన మరియు పోషక లక్షణాల కారణంగా దీనిని ప్రతి ఇంట్లో ఉపయోగిస్తారు. అయితే నెయ్యి శరీర బరువును పెంచుతుందా లేదా తగ్గుతుందా అనే అయోమయంలో చాలా మంది ఇప్పటికీ ఉన్నారు. నెయ్యి బరువు పెరుగుతుందని చాలా మంది చెబుతుంటే, మరికొందరు నెయ్యి బరువు తగ్గడానికి సహాయపడుతుందని అంటున్నారు. కాబట్టి బరువు పెరగడానికి లేదా తగ్గడానికి నెయ్యిని నిజంగా ఉపయోగించాలా? నెయ్యిలో సహజంగా లభించే కొవ్వులు :…
అయోధ్యలో రామమందిరం కట్టిన తర్వాత ఇప్పుడు భక్తులతో పాటు పెద్ద పెద్ద కంపెనీలు కూడా వస్తున్నాయి. ఈ కారణంగా భూముల ధరలు విపరీతంగా పెరిగి పాత వృత్తులు కాకుండా కొత్త వృత్తులు అవలంబిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ భూమి కొనుగోలు నుండి హోటల్ వ్యాపారం వరకు, అయోధ్య ప్రజలు కొత్త ఉపాధి కోసం చూస్తున్నారు. అయోధ్యలోని నయా ఘాట్‌కు దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న తిహురా మజ్హాన్ గ్రామంలో అమితాబ్ బచ్చన్ భూమిని కొనుగోలు…
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. జిల్లా కేంద్రంలో తాజాగా శుభకార్యాలు జరిగిన పలువురు నాయకుల ఇండ్లకు వెళ్ళి కలిశారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సర్పంచ్ లకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పదవిలో నుండి పోయేముందు కూడా గౌరవంగా పంపించాలని భావనతో ఆత్మీయ సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. పదవులు వస్తాయి, పోతాయి, అంతేకాని శాశ్వతం కాదు. పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా…
అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని జగ్గన్నతోట ఏకాదశ రుద్రుల ప్రభల తీర్థం అంబరానంటింది. అంబాజీపేట మండలంలోని 11 గ్రామాల నుంచి ఏకాదశ రుద్రుల ప్రభలను ప్రత్యేకంగా అలంకరించి భుజాలపై మోసుకొని ఊరేగింపుగా తీసుకొని వచ్చి జగ్గన్నతోటలో ఆశీనులు చేశారు. ఈ ప్రభలను తిలకించేందుకు జనాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జగ్గన్నతోటలో ఆశీనులైన ఏకాదశ రుద్రులు భక్తులు భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నారు.