Aishwarya Rai : ఆరాధ్యకు ఫోన్ లేదు.. ఐశ్వర్య రాయ్ కఠిన నిబంధనలు! అభిషేక్ బచ్చన్ షాకింగ్ రివీల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేటి కాలంలో ఏడాది నిండని పసిపిల్లలు కూడా స్మార్ట్ ఫోన్ లకు అలవాటు పడిపోతున్నారు. ఇక స్కూల్ పిల్లలకైతే ఫోన్ నిత్యావసరంగా మారింది. సామాన్యుల ఇంట్లోనే పరిస్థితి ఇలా ఉంటే, ఇక సెలబ్రిటీల గురించి చెప్పనక్కర్లేదు. ఐఫోన్లు, టాబ్‌లు అంటూ లగ్జరీ గ్యాడ్జెట్స్‌తో కాలం గడిపేస్తుంటారు. కానీ, బాలీవుడ్ స్టార్ కపుల్ ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ తమ కుమార్తె ఆరాధ్య విషయంలో మాత్రం చాలా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అభిషేక్ బచ్చన్ తన కుమార్తె మొబైల్ ఫోన్ వాడకం పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read : Vishwambhara : ‘విశ్వంభర’పై కీలక నిర్ణయం తీసుకున్న చిరు..
Also Read
ఆరాధ్యకు ప్రస్తుతం 14 ఏళ్లు వచ్చినప్పటికీ, ఆమెకు ఇప్పటికీ సొంతంగా మొబైల్ ఫోన్ లేదని ఆయన వెల్లడించారు. నేటి కాలంలో చిన్న పిల్లలకే స్మార్ట్ ఫోన్లు ఉంటున్న తరుణంలో, స్టార్ కిడ్ అయి ఉండి కూడా ఆరాధ్యకు ఫోన్ లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ నిబంధన వెనుక ఉన్న కారణాన్ని వివరిస్తూ, ఇది తాము చాలా కాలం క్రితమే తీసుకున్న నిర్ణయమని అభిషేక్ తెలిపారు. ఒకవేళ ఆరాధ్య స్నేహితులు ఎవరైనా ఆమెతో మాట్లాడాలని అనుకుంటే, వారు నేరుగా తన తల్లి (ఐశ్వర్య రాయ్) ఫోన్‌కే కాల్ చేయాల్సి ఉంటుంది. పిల్లలను డిజిటల్ ప్రపంచానికి దూరంగా ఉంచుతూ, క్రమశిక్షణతో పెంచాలనే ఉద్దేశంతోనే ఐశ్వర్య ఈ కఠినమైన రూల్స్ పెట్టినట్లు తెలుస్తోంది. సెలబ్రిటీ హోదాలో ఉండి కూడా సాధారణ పిల్లల తరహాలోనే ఆమెను పెంచుతున్న తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మొత్తానికి బచ్చన్ ఫ్యామిలీ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
తాజావార్తలు
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
-
Jr NTR : ‘యమదొంగ’ మ్యాజిక్ రిపీట్.. తారక్ మాస్ ఎంట్రీకి ఫ్యాన్స్ ఫిదా
-
OTR: నాయకులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని అనంత క్యాడర్ డిమాండ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!