గుజరాత్ లోని వడోదరకు చెందిన బిహాభాయ్ భర్వాద్ రామ భక్తుడు.. రామాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని 3.5 అడుగుల వెడల్పు, 108 అడుగుల పొడవుతో భారీ అగర్బత్తిని తయారు చేశాడు. ఆ భారీ అగర్బత్తి అయోధ్య రామయ్య పాదాల చెంత వెలిగింది. రామయ్యకు తమ గ్రామం నుంచి ఏదైనా కానుక ఇవ్వాలని భావించిన తర్సాలీ గ్రామం.. ఈ భారీ అగర్‌బత్తీని తయారుచేసింది. ఈ అగర్బత్తితో రాముడికి రోజూ ధూపం వేయాల్సిన పని కూడా తప్పుతుందని గ్రామస్థులు తెలిపారు. కాగా..…
కోరుట్ల పట్టణంలో సోమవారం గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఇద్దరు చిన్నారులకు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సంక్రాంతి పండుగ సందర్భంగా భీమునిదుబ్బ ప్రాంతంలో తమ ఇంటి డాబాపై ఇద్దరు చిన్నారులు తోకల సాత్విక్, ప్రశాంత్ గాలిపటం ఎగురవేస్తున్నారు. ఈ క్రమంలో గాలిపటం ఎగురవేసేందుకు ఉపయోగించే దారం విద్యుత్ తీగలలో ఇరుక్కుపోయింది. తీగలలోని దారాన్ని తీసేందుకు ప్రయత్నించగా, బాలురు విద్యుత్ వైరుకు తగిలి గాయాలు అయ్యాయి. వారిని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి…
ఢిల్లీ లిక్కర్ స్కాంలో రేపు విచారణకు హాజరుకాలేనని ఎమ్మెల్సీ కవిత ఈడీకి లేఖ రాశారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉందని గుర్తు చేశారు. కేసు తేలే వరకు హాజరుకాకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో గతేడాది మార్చిలో మూడు రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. అయితే తాజాగా ఎమ్మెల్సీ కవితకు ఈడీ సమన్లు జారీ చేసింది. జనవరి 16న ఈడీ ఎదుట హాజరు కావాలని కవితను ఆదేశించింది. తెలంగాణ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలు కవితను 2022…
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయం సాధించాలని చూస్తున్న తెలంగాణలో పార్టీ రాజస్థాన్ విభాగంలో కీలకమైన సంస్థాగత నేత చంద్రశేఖర్‌ను ప్రధాన కార్యదర్శి (సంస్థ)గా బీజేపీ సోమవారం నియమించింది. ఈ నియామకాన్ని బీజేపీ ఇక్కడ ఒక ప్రకటనలో ప్రకటించింది. అనేక మంది సీనియర్ పార్టీ నాయకుల నుండి ప్రశంసలు అందుకున్న చంద్రశేఖర్, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలలో రాజస్థాన్‌లో పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డాను కలిసి కొత్త నియామకం కోసం…
గోదావరి ముందు పుట్టి ఆ తర్వాతే మర్యాద పుట్టిందని పెద్దలు సామెత చెబుతారు. అది ఇప్పుడు నిజమే అనిపిస్తోంది. గోదావరిలోని ఎవరింటికైనా వెళ్తే వారికి ఆ రోజు పండగే పండగ. కడుపు నిండిపోయేలా భోజనాలు కొసరికొసరి వడ్డిస్తారు.
వికారాబాద్ జిల్లా అనంతగిరిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం కోసం 100కోట్లు మంజూరు చేశారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. వికారాబాద్ జిల్లా అనంతగిరి అనంత పద్మనాభ స్వామిని దర్శించుకునేందుకున్న అనంతరం ధారూర్ మండలం కోట్ పల్లి ప్రాజెక్టులో బోటింగ్ లో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో హైదరాబాద్‌కు అత్యంత దగ్గరగా ఉన్న అనంతగిరి అడవుల్లో పర్యాటక అభివృద్ధి చేస్తామన్నారు. పర్యాటక రంగం అభివృద్ధికి భారతదేశంలో ఉన్న సౌకర్యాలు మరే దేశంలోనూ…
మకర సంక్రాంతి సందర్భంగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన ప్రభల ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉభయగోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన జనంతో కొత్తపేట వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. పోటాపోటీగా సాగిన బాణసంచా కాల్పులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడనుంది. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీం కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు 17ఏపై దాఖలు చేసిన పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది.
చలికాలంలో అరటిపండు తినకూడదని చాలా మంది చెబుతుంటారు. కానీ చలికాలంలో రోజూ తినవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఇందులోని గుణాలు అన్ని రకాల పొట్ట సమస్యలను నయం చేస్తాయి. అరటిపండులో శరీరానికి అవసరమైన పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ మరియు కాల్షియం తగిన మోతాదులో ఉంటాయి. కాబట్టి దీన్ని రోజూ తినడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది మరియు శరీరానికి త్వరగా శక్తిని ఇస్తుంది. అరటిపండులో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి వీటిని రోజూ తినడం…