సెంట్రల్ థాయ్‌లాండ్‌లోని సుపాన్ బూరిరి ప్రావిన్సులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 20 మంది కార్మికులు మరణించినట్లు రెస్క్యూ పనులు చేపడుతున్న సిబ్బంది తెలిపారు.
శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్ చెప్పింది. రేపటి(గురువారం) నుంచి ఆన్లైన్లో ఏప్రిల్ నెలకు సంబంధించిన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీడీడీ తెలిపింది.
కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ జన్మదినమైన డిసెంబర్ 9 రైతులకు కానుకగా 2 లక్షల లోపు వ్యవసాయ రుణాన్ని మాఫీ చేస్తానని నాటి ప్రతిపక్ష నేత నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9 ముగిసి కొత్త సంవత్సరం వచ్చిన ఈ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనబడటం లేదని, అదే విధంగా రైతుబంధు…
ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత నారాచంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై బుధవారం నాడు విచారణ జరగలేదు. చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ ఆఖరి నిమిషంలో ఆగిపోయింది.
వరంగల్ జిల్లా నర్సంపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నర్సంపేట నియోజకవర్గ రైతులందరు యాసంగి పంట కోసం గోదావరి జలాల కోసం ఎదురుచూస్తున్నారన్నారు. గత ప్రభుత్వం నియోజకవర్గంలో మూడు, నాలుగు సంవత్సరాలుగా ఇరిగేషన్ సర్క్యుట్ ప్లాన్ ప్రాకారం గోదావరి జలాలను తీసుకువచ్చి రెండు పంటలకు నీరందించామని ఆయన వెల్లడించారు. ప్రత్యేకమైన ఏజన్సీని పెట్టుకొని సమగ్రమైన ప్రణాళిక…
అనకాపల్లి జిల్లాలో కోడికత్తి దాడి కేసు కులం రంగు పులుముకుంది. నిందితులపై చర్యలు చేపట్టాలని ప్రత్యర్థి వర్గం రోడ్డెక్కడం ఉద్రిక్తతకు దారితీసింది. బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామానికి చెందిన యువకులు మధ్య కనుమపండుగ రోజు కోడి పందాల విషయంలో వాగ్వివాదం జరిగింది.
పంజాబ్ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసి విజయం నమోదు చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి ఈ ప్రకటన తర్వాత పంజాబ్‌లో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తుపై సందేహం నెలకొంది. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ప్రతిపాదనను కాంగ్రెస్ రాష్ట్ర విభాగం నిరంతరం వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలో.. పంజాబ్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు నేతలు ఆప్‌తో…
దేశంలోనే పేరుగాంచిన విద్యాసంస్థలకు కేంద్రమైన నరసరావుపేటలో కే – రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్‌ను ప్రారంభించడం శుభపరిణామమని అని బనగానపల్లె టీడీపీ మాజీ శాసనసభ్యులు బీసీ జనార్థన్ అన్నారు.
గ్లోబల్ మార్కెట్ బలహీన ధోరణి కారణంగా ఈరోజు స్టాక్ మార్కెట్ క్షీణతతో ప్రారంభమైంది. గురువారం సెన్సెక్స్, నిఫ్టీలలో భారీ క్షీణత కనిపించింది. మార్కెట్ ప్రారంభమైన వెంటనే.. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా పడిపోయి 72000 దిగువకు చేరుకుంది. నిఫ్టీ 21650 దిగువన ప్రారంభం కాగా... ఆ తర్వాత స్టాక్ మార్కెట్లో భారీ ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి.
విజయవాడ స్వరాజ్య మైదానంలో ఎల్లుండి భారీ అంబేడ్కర్ విగ్రహం, స్మృతి వనం ప్రారంభోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సీఎం జగన్ పాల్గొని ప్రారంభించనున్నారు.