నల్లగొండ పట్టణంలో మున్సిపల్ రోడ్ల నిర్మాణంకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. నల్లగొండ మున్సిపాలిటీనీ మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని ఆయన వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి నిరుపేదల సొంతింటి కలను నిజం చేస్తామని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఫిబ్రవరిలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. UPSC…
అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవంకు సంబంధించి సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటికే నగరమంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కాగా.. జనవరి 22న ప్రాణప్రతిష్ఠా కార్యక్రమంలో ప్రధాని మోదీ సహా పలువురు ప్రముఖులు రామమందిర సముదాయంలో హాజరుకానున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనబోమని ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రకటించిన సంగతి తెలిసిందే.. కాగా.. ఆ రోజున తమ తమ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడపనున్నట్లు తెలిపారు.
చంద్రబాబుపై కేసు నమోదు, విచారణ, రిమాండ్, అరెస్టు అన్నీ సక్రమమేనని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. కానీ కొందరు చంద్రబాబుకు భారీ ఊరటని చెబుతున్నారని, కోర్టు దోషి అని చెప్పినా ఊరట అని వీళ్ళు అంటున్నారని మంత్రి అన్నారు.
నిజామాబాద్ ఆంధ్రానగర్లో ఎన్.టి.అర్. విగ్రహాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి రైతుబంధు నగదు జమ కానుందని ఆయన వెల్లడించారు. రైతాంగ సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆంధ్ర నగర్లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కృషి చేసిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు మంత్రి తుమ్మల. నిజామాబాద్ జిల్లా వ్యవసాయానికి పెట్టింది పేరని, ఎన్టీఆర్ నేటికీ తరానికి ఆదర్శ ప్రాయుడని ఆయన కొనియాడారు.…
14 మంది శివసేన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకూడదన్న స్పీకర్ ఆదేశాలను సవాల్ చేస్తూ శివసేన (షిండే) చీఫ్ విప్ భరత్ గోగావాలే దాఖలు చేసిన పిటిషన్పై బాంబే హైకోర్టు శివసేనకు నోటీసులు జారీ చేసింది. జూన్ 2022లో చీలిక తర్వాత ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని సేన వర్గాన్ని నిజమైన రాజకీయ పార్టీగా ప్రకటిస్తూ.. మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో షిండే గ్రూప్…
వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ అధ్వర్యంలో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ (C4IR) హైదరాబాద్లో ప్రారంభించేందుకు ఒప్పందం కుదిరింది. బయో ఏషియా–2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. దీంతో ముఖ్యమంత్రి ఏ.రేవంత్రెడ్డి సారధ్యంలో రాష్ట్ర ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచే (స్టేట్ హెల్త్ టెక్ ల్యాండ్ స్కేప్) సాంకేతిక ఆధారిత కార్యక్రమం రూపుదిద్దుకుంటుంది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో వరల్డ్ ఎకనామిక్…
అఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా ఆటగాడు శివమ్ దూబే హైలెట్ గా నిలిచాడు. ఆడిన రెండు మ్యాచ్ ల్లో వరుసగా రెండు హాఫ్ సెంచరీలు బాదాడు. అంతేకాకుండా.. మ్యాచ్ని ముగించిన తీరు, స్పిన్నర్లపై స్ట్రోక్లు కొట్టిన తీరు.. మేనేజ్మెంట్ను తెగ అట్రాక్ట్ చేశాయి. అయితే.. ఈ ఫర్మార్మెన్స్ టీ20 ప్రపంచ కప్ 2024లో ఆడేందుకు బాటలు వేసింది. ఇదిలా ఉంటే.. బీసీసీఐ శివమ్ నుండి కొత్త డిమాండ్ ను కోరుతుంది. దూబే తన…
పార్లమెంట్ ఎన్నికల పై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. గాంధీ భవన్ లో మూడు పార్లమెంట్ నియోజక వర్గాల మైనార్టీ నాయకుల తో ఏఐసీసీ ఇంఛార్జి దీపా దాస్ మున్షీ, ఏఐసీసీ కార్యదర్శి మన్సూర్ అలీ ఖాన్, రోహన్ చౌదరి సమావేశమయ్యారు. సికింద్రాబాద్, చేవెళ్ల, హైదారాబాద్ పార్లమెంట్ నియోజక వర్గాల మైనార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. సికింద్రాబాద్, హైదారాబాద్ నియోజక వర్గాలలో పట్టు కోసం కాంగ్రెస్ వరుస సమీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్, హైదారాబాద్…
భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ 2024 ఆర్థిక సంవత్సరం (ఎఫ్వై24క్యూ3) మూడో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. ఏడాది ప్రాతిపదికన (YoY) 34 శాతం పెరుగుదలతో రూ.16,373 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు కంపెనీ తెలిపింది. HDFC బ్యాంక్ నికర లాభం విశ్లేషకుల అంచనాల కంటే మెరుగ్గా ఉంది. LSEG డేటా ప్రకారం.. విశ్లేషకులు నికర లాభం రూ.15,651 కోట్లుగా అంచనా వేశారు.
జనాభా లెక్కలు కులాల వారీగా కేంద్రం చెప్పటం లేదు రేపు మధ్యాహ్నం 2 గంటలకు కాంగ్రెస్ ఎస్టీ విభాగం కార్యవర్గ సమావేశం ఉందని తెలిపారు ఆదివాసీ కాంగ్రెస్ చైర్మన్ బెల్లయ్య నాయక్. అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్టీ విభాగం చేసిన పనితీరు.. పార్లమెంట్ ఎన్నికలకు అదేవిధంగా పనిచేయాలి దిశ నిర్దేశం చేయడమే అజెండా అని ఆయన తెలిపారు. రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో న్యాయ్ యాత్ర చేస్తున్నారని, జనాభా లెక్కలు కులాల వారీగా కేంద్రం చెప్పటం…