మెగాస్టార్ చిరంజీవి తన లేటెస్ట్ సినిమా ‘మన శంకరవర ప్రసాద్ గారు’ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమాలో చిరు తన వింటేజ్ కామెడీ టైమింగ్.. ఎనర్జీతో ప్రేక్షకులను మెప్పించి, బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను సాధిస్తున్నారు. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో, చిరంజీవి ఇప్పుడు తన తదుపరి భారీ ప్రాజెక్ట్ ‘విశ్వంభర’ను పట్టాలెక్కించే పనిలో పడ్డారు. వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సోషియో-ఫాంటసీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, సినిమాలోని భారీ స్థాయి గ్రాఫిక్స్ (VFX) పనులు ఆలస్యం కావడంతో, ఈ చిత్రం విడుదల వాయిదా పడుతూ వస్తోంది. కానీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా నాణ్యత విషయంలో ఎక్కడా తగ్గకూడదని మెగాస్టార్ నిర్ణయించుకున్నారు.
Also Read : Radhika Apte: షూటింగ్ గంటలపై రాధికా ఆప్టే కీలక నిర్ణయం!
ఇక అసలు విషయానికి వస్తే, బాబీ దర్శకత్వంలో మొదలవ్వాల్సిన చిరు తదుపరి చిత్రం ప్రీ-ప్రొడక్షన్ పనుల వల్ల ఫిబ్రవరికి వాయిదా పడింది. దీంతో దొరికిన ఈ సమయాన్ని పూర్తిగా ‘విశ్వంభర’ కోసం కేటాయించాలని చిరు భావిస్తున్నారు. తనే స్వయంగా దగ్గరుండి వీఎఫ్‌ఎక్స్ పనులను పర్యవేక్షిస్తూ, టెక్నికల్ టీమ్‌కు తగిన సూచనలు ఇవ్వబోతున్నారు. అవుట్‌పుట్‌ను ఒకసారి క్షుణ్ణంగా రీచెక్ చేసిన తర్వాతే రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. గ్రాఫిక్స్ పనులు త్వరగా పూర్తి చేసి, ఈ విజువల్ వండర్‌ను సాధ్యమైనంత త్వరగా థియేటర్లలోకి తీసుకురావాలని మెగాస్టార్ ప్లాన్ చేస్తున్నారు.