తెలంగాణలో నేడు విద్యాసంస్థలకు సెలవు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు స్కూళ్లకు సెలవు. వారం రోజులు సంతాప దినాలు పాటించాలని ఉత్తర్వులు. మాజీ ప్రధాని మన్మోహన్ నివాసంలో పార్ధివదేహం. మన్మోహన్ పార్థివదేహానికి నివళులర్పించిన నేతలు. రేపు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. ఢిల్లీ: ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం. నేడు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు రద్దు. వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం. మన్మోహన్‌సింగ్‌కు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయం. విద్యుత్ ఛార్జీల…
కర్నాటకలోని బెల్గాంలో జరుగుతున్న సీడబ్ల్యుసీ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్‌గౌడ్, ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఈ క్రమంలో.. సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ నుంచి మాట్లాడే అవకాశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్లకు దక్కింది.
హైదరాబాద్‌లో భారీ వర్షం పడుతుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో నగరంలో వాన దంచికొడుతుంది. అబిడ్స్, కోఠి, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, సికింద్రాబాద్, తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.
వికారాబాద్ జిల్లా పరిగి సీఐ కార్యాలయంలో ఐజీ సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. నిన్న కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పరిగిలో ప్రెస్ మీట్ నిర్వహించడంపై ఐజీ స్పందించి ఫైరయ్యారు. పట్నం నరేందర్ రెడ్డి కండిషన్ బెయిల్ పై ఉండి విచారణను ప్రభావితం చేసే విధంగా ప్రెస్ మీట్ పెట్టడం సరి కాదని తెలిపారు. బెయిల్ రద్దుకు సిఫారసు చేస్తామని ఐజీ సత్యనారాయణ హెచ్చరించారు.
సిద్ధిపేట జిల్లా కేంద్రంలో విషాదం నెలకొంది. గాలిపటం ఓ బాలుడి ప్రాణం తీసింది. గాలిపటం ఎగరవేస్తూ చెరువులో పడి చనిపోయాడు. లెక్చరర్స్ కాలనీలో ఉండే తేజ (11) గాలిపటం ఎగరవేస్తుండగా ప్రమాదవశాత్తు గాలిపటం దారం తెగిపోయి.. సమీపంలో ఉన్న చెరువులో పడింది. దీంతో.. గాలిపటం కోసం వెళ్లిన ఆ బాలుడు మృత్యుఒడిలోకి వెళ్లిపోయాడు.
ప్రధాని మోడీ, రైల్వే మంత్రి అశ్వినీవైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు భేటీ ఢిల్లీలోని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికార నివాసానికి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ విచ్చేశారు. సీఎం చంద్రబాబుతో రైల్వే మంత్రి భేటీ అయ్యారు. ఏపీలోని పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసానికి సీఎం చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చ చేపట్టారు. సాయంత్రం 6.30…
నల్ల జీలకర్ర సహాయంతో రక్తంలో చక్కెరను సహజంగా నియంత్రించవచ్చు. నల్ల జీలకర్రను ఆయుర్వేదంలో ఒక ప్రత్యేక సహజ ఔషధంగా పిలుస్తారు. నల్ల జీలకర్ర సాధారణ జీలకర్ర నుండి కొద్దిగా భిన్నంగా ఉంటుంది.
మహిళలను మోసం చేసిన సర్కార్ కాంగ్రెస్ పార్టీ మెదక్ చర్చిలో ఎమ్మెల్సీ కవిత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. మెదక్ చర్చి వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రార్థనలు చేశానని, క్రైస్తవ సోదరులకు బీఆర్ఎస్ పార్టీకి పేగు సంబంధం ఉందన్నారు కవిత. తెలంగాణ పోరాటంలో ప్రతి ఒక్క చర్చిలో ప్రార్థనలు జరిగాయని, మెదక్ జిల్లా కల సాకారం అయిందంటే కారణం కేసీఆర్ అని ఆమె వ్యాఖ్యానించారు. మెడికల్ కాలేజీ, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు…
కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి మెల్బోర్న్ వీధుల్లో సరదాగా తిరుగుతూ కనిపించాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరూ రోడ్డుపై తిరుగుతున్నారు. ఇద్దరూ కాలినడకన వెళ్తున్నారు.