తాంసి మండలం చర్లపల్లి గ్రామం వద్ద సోమవారం టీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడటంతో కండక్టర్‌తో సహా ఐదుగురికి గాయాలయ్యాయి. గ్రామ సమీపంలోని వంపు వద్ద వాహనం తాబేలు కావడంతో ముగ్గురు ప్రయాణికులు, బస్సు కండక్టర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వంపు వద్ద బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప…
జార్ఖండ్‌లో కాంగ్రెస్ ''భారత్ జోడో న్యాయ్ యాత్ర'' కొననసాగుతుంది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారితో మమేకమవుతున్నారు. తాజాగా ఆయన బొగ్గు రవాణా కార్మికులతో కలిసి ముచ్చటించారు. సైకిళ్లపై టన్నుల బరువును మోసుకెళ్తున్న కార్మికుల కష్టాన్ని తెలుసుకునేందుకు 200 కిలోల బొగ్గుతో ఉన్న సైకిల్‌ను నడిపారు. కాగా.. అందుకు సంబంధించిన ఫొటోలను ట్వి్ట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ.
రేవంత్ రెడ్డి మితి మీరిన అహంకారంతో మాట్లాడారని, వితండ వాదం చేశారని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నీచమైన పద్ధతి లో కేసీఅర్ పై వ్యక్తిగత దూషణలు చేశారు రేవంత్ అని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం మేము KRMBకి ప్రాజెక్ట్ లు అప్పజెప్పామని రంకెలు వేస్తుందని, KRMB మీటింగ్ లో ప్రాజెక్ట్ లు అప్పగించేందుకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుందన్నారు హరీష్ రావు. రెండు…
లోక్‌సభ ఎన్నికలకు మరికొంత సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇందుకు సంబంధించి రాజకీయ పార్టీలతో పాటు ఎన్నికల సంఘం కూడా సన్నాహాలు ముమ్మరం చేసింది. ఈ క్రమంలో.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోస్టర్లు, కరపత్రాలతో సహా ఎటువంటి ప్రచార సామాగ్రిలో పిల్లలను ఏ రూపంలో ఉపయోగించవద్దని ఎన్నికల సంఘం సోమవారం రాజకీయ పార్టీలను ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో పార్టీలు కానీ.. అభ్యర్థులు కానీ ఏ విధంగానైనా పిల్లలను ఉపయోగించుకోవడం పట్ల ఎన్నికల సంఘం "జీరో…
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సి రావటం దురదృష్టకరమన్నారు. ఐతవరం నుంచి మైలవరం వచ్చి ఆరేళ్లు పనిచేశానన్న ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్.. ఈ అవకాశం ఇచ్చిన జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Top Headlines at 1 PM on 05th February 2024, Top Headlines at 1 PM, Telangana, Andhrapradesh, Telugu News, Tollywood, National News, International News
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ(సోమవారం) ప్రారంభమయ్యాయి. ఇవాళ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం బీఏసీ సమావేశమైంది. ఈ బీఏసీ సమావేశంలో నాలుగు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.
ఏపీలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే గవర్నర్ ప్రసంగం నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అసెంబ్లీ లాబీల్లో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ వెళ్లే దారిలో టీడీపీ సభ్యులు బైఠాయించేందుకు ప్రయత్నం చేశారు.
తిరుమలలో శ్రీవెంకటేశ్వర ధార్మిక సదస్సు ముగిసింది. మూడు రోజుల పాటు సాగిన సదస్సులో 62 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు సూచనలు, సలహాలు ఇచ్చారు. మూడు రోజులు పాటు జరిగిన ధార్మిక సదస్సులో అనేక తీర్మానాలు చేశామని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గురించి గవర్నర్ ప్రసంగించారు. విజయవాడలో బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించామని.. సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోందని గవర్నర్ తెలిపారు.