మాములుగా అయితే ఏటీఎంను చోరీ చేయడం చూశాం.. నగదు, బంగారం చోరీ చేయడం చూశాం.. కానీ వెరైటీ ఈ దొంగలు ఈవీఎం మిషన్ ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పూణేలోని రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో వెలుగు చూసింది. సోమవారం తెల్లవారుజామున పుణె జిల్లా సస్వాద్‌లోని తహసీల్దార్ కార్యాలయంలో ఓ గదిలో ఉన్న ఈవీఎం మెషీన్‌కు చెందిన డెమో మిషన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కాగా.. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీలో రికార్డైంది. స్ట్రాంగ్‌రూమ్ తాళం పగులగొట్టి, గదిలో ఉంచిన ఈవీఎం మెషిన్ కంట్రోల్ యూనిట్ చోరీకి గురైనట్లు తహసీల్దార్ కార్యాలయ అధికారులు గుర్తించారు.
Read Also: Ambajipeta Marriage Band : కీలక నిర్ణయం తీసుకున్న చిత్ర యూనిట్.. ఆ ఊరి ప్రజలకు ప్రత్యేక విందు..
కాగా.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనకి సంబంధించి సాస్వాద్ పోలీస్ స్టేషన్‌లో ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పుణె రూరల్ పోలీసు సూపరింటెండెంట్ పంకజ్ దేశ్‌ముఖ్ తెలిపారు. సస్వాద్ తహసీల్దార్ కార్యాలయం ప్రాంతంలో దొంగలను గుర్తించడానికి పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇదిలా ఉంటే.. సస్వాద్ తహసీల్దార్ కార్యాలయంలో మొత్తం 40 ఈవీఎం మెషిన్లు ఉన్నాయి. అయితే దొంగలు ఈవీఎం మిషన్‌ను ఎందుకు దొంగిలించారో వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: INDIA Bloc: ముంబై వేదికగా బలప్రదర్శనకు ఇండియా కూటమి ప్లాన్..