న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్‌లో రికార్డులు బద్దలు కొట్టనున్నాడు. తన క్రికెట్ చరిత్రలో ఇప్పటికే తన పేరిట కొన్ని రికార్డులు ఉండగా.. మరికొన్ని బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ జరుగుతున్న మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు (118, 109) నమోదు చేశాడు. ఈ ఫీట్ సాధించిన ఐదో న్యూజిలాండ్ బ్యాట్స్మెన్గా కేన్ మామ రికార్డుల్లోకెక్కాడు.
WhatsApp : వాట్సాప్ డేటా బ్యాకప్‌పై భారీ షాక్.. కొత్త రూల్స్..
కాగా.. ఈ టెస్ట్ మ్యాచ్ లో రెండు సెంచరీలు చేయడంతో కేన్ విలియమ్సన్ తన టెస్ట్ సెంచరీలు మొత్తం 31కి చేరుకుంది. అన్ని ఫార్మాట్లలో కలిసి 44 సెంచరీలు ఉన్నాయి. అయితే.. అత్యధిక సెంచరీలు నమోదు చేసిన ఆటగాడిగా యాక్టివ్ ప్లేయర్స్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. మరోవైపు.. విరాట్ కోహ్లి (80 సెంచరీలు) టాప్‌లో ఉన్నాడు. ఆ తర్వాత డేవిడ్ వార్నర్ (49 సెంచరీలు), జో రూట్ (46), రోహిత్ శర్మ (46), స్టీవ్ స్మిత్ (44) ఉన్నారు. మరోవైపు.. టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా (170 ఇన్నింగ్స్‌ల్లో) 31 సెంచరీలు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డు సాధించాడు. కేన్ మామ.. ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్ లో నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్నాడు.
KCR : ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభ నిర్వహించి తీరుతాం
ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ మ్యా్చ్ లో న్యూజిలాండ్ గెలుపు దిశగా ముందుకెళ్తుంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి కివీస్ జట్టు 528 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఏదైనా అద్భుతం జరిగితే కానీ.. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలవలేదు. మరోవైపు.. ఈ టెస్ట్ మ్యాచ్ లో రచిన్ రవీంద్ర డబుల్ సెంచరీ (240) పరుగులు చేశాడు.