లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తన పదేళ్ల పదవీకాలంలో సాధించిన విజయాలను ప్రస్తావించారు. తొలి టర్మ్‌లో అభివృద్ధి పథంలో కాంగ్రెస్ సృష్టించిన గుంతలను పూడ్చడానికే కాలయాపన చేయాల్సి వచ్చిందన్నారు. అప్పుడు దేశాభివృద్ధికి పునాది వేశాం, రెండో టర్మ్‌లో దేశం వేగంగా ఎన్నో విజయాలు సాధించిందని తెలిపారు.
బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాల్క సుమన్ వ్యాఖ్యలపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా వివేక్ వెంకట స్వామి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై బాల్కసుమన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బాల్కసుమన్ వ్యాఖ్యలను జనం ఈసడించుకున్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో మాట్లాడారు.. దాంతో ప్రజలు సరియైన గుణపాఠం చెప్పారు.అయినా బుద్దిరాలేదని, ఒళ్లు దగ్గర పెట్టుకోండి..సరిగా మాట్లాడండీ అని ఆయన హితవు పలికారు.…
ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం గోవాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా.. 'ఇండియా ఎనర్జీ వీక్ 2024'ను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా.. రూ. 1,350 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. దాంతో పాటు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) క్యాంపస్‌ను జాతికి అంకితం చేయనున్నారు. అనంతరం డెవలప్డ్ ఇండియా, డెవలప్డ్ గోవా 2047 కార్యక్రమంలో మోడీ ప్రసంగించనున్నారు.
మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలై పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. ఇవాళ అద్దంకి దయాకర్ మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సన్నాసులు పిచ్చి మాటలు మాట్లాడితే ప్రజలు పండబెట్టి తొక్కుతారన్నారు. 4 కోట్ల మంది చెప్పుతో కొట్టినా బుద్దిరాలేదని, చెప్పులతోని కొట్టిన గాని బీఆర్ఎస్ వాళ్ళకి బుద్ధి రాలేదని ఆయన మండిపడ్డారు. రెండు నెలలకే తట్టుకోలేని పరిస్థితి వచ్చింది మీకు అని, ఫ్రస్టేషన్లో ఏది…
లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానంపై చర్చించారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్ష పార్టీలపై ప్రధాని మోడీ విరుచుకుపడ్డారు. విపక్షాల తీర్మానాన్ని నేను అభినందిస్తున్నాను అని ప్రధాని మోదీ అన్నారు. విపక్షాలు చాలాకాలం పాటు విపక్షంలోనే ఉండాలనే సంకల్పం తీసుకున్నాయని ప్రధాని ఎద్దేవా చేశారు. మరోవైపు... ఈ రోజు దేశం ఎదుర్కొంటున్న సమస్యలకు కాంగ్రెస్సే కారణమని దుయ్యబట్టారు. వారసత్వ రాజకీయాలను ప్రొత్సహిస్తూ కేవలం ఒక్కరి కోసమే కాంగ్రెస్ పాకులాడుతోందని…
క్రైమ్ బ్రాంచ్ నోటీసు విషయంలో అరవింద్ కేజ్రీవాల్ బీజేపీని, కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. తన ఇంటి ముందు 5 గంటల పాటు క్రైం బ్రాంచ్ అధికారులు డ్రామా ఆడేలా చేసింది బీజేపీ.. అతీషి ఇంటి ముందు 5 గంటల పాటు డ్రామా సాగిందని కేజ్రీవాల్ తెలిపారు. క్రైం బ్రాంచ్ అధికారులు తీసుకొచ్చిన నోటీసులో ఎలాంటి ఎఫ్ఐఆర్ ప్రస్తావన లేదని, ఇప్పటికీ నోటీసుకు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చామని తెలిపారు. అయితే ఇలాంటి డ్రామాలు దేశ ప్రగతికి…
దక్షిణ తెలంగాణకు, ముఖ్యంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు అన్యాయం చేసింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. SLBC ప్రాజెక్ట్ ను నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. దోచుకోవడానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారని, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరువు ఛాయాలకు కేసీఆర్ కారణమన్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. హాంతకుడికి, పనికిరాని వ్యక్తి జగదీష్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చారని ఆయన మండిపడ్డారు. మంత్రి జగదీష్ రెడ్డి…
లక్నో జైలులో హెచ్ఐవీ కలకలం రేపిన సంగతి తెలిసిందే. జైలులో మొదటగా 47 మందికి హెచ్ఐవీ సోకినట్లు తేలగా.. తాజాగా ఆ సంఖ్య 63కు చేరుకుంది. ప్రస్తుతం ఈ వ్యాధి సోకిన రోగులందరికీ లక్నోలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. డిసెంబర్ 2023లో ఉత్తర ప్రదేశ్ ఆరోగ్య శాఖ నిర్వహించిన ఆరోగ్య పరీక్షల్లో ఈ కేసులు బయటపడ్డాయి. జైలు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హెచ్ఐవీ సోకిన ఖైదీలలో చాలా మంది డ్రగ్స్ కు బానిసైన వారే ఉన్నారని…
సీఎం రేవంత్ రెడ్డి లంకె బిందెలు ఖాళీ అయ్యి పెంక కుండలు ఉన్నాయని అంటున్నారని అన్నారు బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 13 వేల కోట్ల బడ్జెట్ తో మోడీ విశ్వకర్మ యోజన ప్రవేశపెట్టారని, ఎన్నికల కారణంగా అమలు కాస్త ఆలస్యమైందని ఆయన తెలిపారు. అయినా ఇప్పటి వరకు 1.20 లక్షల మందిని విశ్వకర్మ యోజనలో చేర్పించామని ఆయన పేర్కొన్నారు. కానీ దీనికి సంబంధించి ఎంపిక చేయాల్సిన బాధ్యత రాష్ట్ర…
ఢిల్లీ మాజీ మంత్రి, జైలులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నాయకుడు మనీష్ సిసోడియాకు రౌస్ అవెన్యూ కోర్టు తన భార్యను కలిసేందుకు అనుమతి మంజూరు చేసింది. కస్టడీ పెరోల్ లో వారానికి ఒకసారి అనారోగ్యంతో ఉన్న తన భార్యను కలిసేందుకు సోమవారం కోర్టు అనుమతి ఇచ్చింది. కాగా.. అంతకుముందు తన భార్యను వారానికి రెండుసార్లు కలిసేందుకు అనుమతి ఇవ్వాలని సిసోడియా తన దరఖాస్తులో కోరారు. కాగా.. మనీష్ సిసోడియా భార్య గత 20 సంవత్సరాలుగా…