మాములుగా అయితే ఏటీఎంను చోరీ చేయడం చూశాం.. నగదు, బంగారం చోరీ చేయడం చూశాం.. కానీ వెరైటీ ఈ దొంగలు ఈవీఎం మిషన్ ను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన పూణేలోని రూరల్ తహసీల్దార్ కార్యాలయంలో వెలుగు చూసింది. సోమవారం తెల్లవారుజామున పుణె జిల్లా సస్వాద్లోని తహసీల్దార్ కార్యాలయంలో ఓ గదిలో ఉన్న ఈవీఎం మెషీన్‌కు చెందిన డెమో మిషన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. కాగా.. ఈ ఘటన అక్కడున్న సీసీటీవీలో రికార్డైంది. స్ట్రాంగ్‌రూమ్ తాళం పగులగొట్టి, గదిలో…
రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన మేరకు 6 నెలల్లో కులగణన చేపట్టడానికి తక్షణమే ప్రక్రియ ప్రారంభించాలని స్పష్టం చేశారు. ఆగమాగం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనుకుంటే ఊరుకోబోమని హెచ్చరించారు. మంగళవారం నాడు వరంగల్ లో బీసీ హక్కుల సాధన కోసం భారత…
న్యూజిలాండ్ స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ టెస్ట్ క్రికెట్లో రికార్డులు బద్దలు కొట్టనున్నాడు. తన క్రికెట్ చరిత్రలో ఇప్పటికే తన పేరిట కొన్ని రికార్డులు ఉండగా.. మరికొన్ని బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రస్తుతం సౌతాఫ్రికాతో న్యూజిలాండ్ జరుగుతున్న మ్యాచ్‌లో కేన్ విలియమ్సన్ వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు (118, 109) నమోదు చేశాడు. ఈ ఫీట్ సాధించిన ఐదో న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌గా కేన్ మామ రికార్డుల్లోకెక్కాడు.
దక్షిణ తెలంగాణ లీడర్లతో బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం ముగిసింది. ఈ సంద్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఈనెల 13 న నల్లగొండ లో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు… నల్లగొండ, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల నుంచి ప్రజలు తరలించాలని పార్టీ నేతలకు సూచించారు. ఇదంతా పాలకులకు ప్రాజెక్ట్ లు, నీళ్ళ గురించి అవగాహన లేకపోవడం తో కేంద్రం గేమ్ స్టార్ట్ చేసిందని ఆయన అన్నారు. ప్రాజెక్ట్ లు ఆధీనం లోకి వెళితే తెలంగాణ…
కరీంనగర్ జిల్లా మానకొండూరులో ఎలుగుబంటి సెర్చ్ ఆపరేషన్ సక్సెస్ అయింది. ఎలుగుబంటును పట్టుకునేందుకు అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఎలుగుబంటికి ఆపరేషన్ టీం డాక్టర్ మత్తు ఇచ్చారు. దీంతో ఎలుగుబంటి సొమ్మసిల్లి పొలంలో పడిపోయింది. అనంతరం ఎలుగుబంటిని చికిత్స నిమిత్తం వరంగల్ కు తరలించారు.
ఎస్సీ వర్గీకరణపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుంది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లను జత చేసింది. పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రధాన పిటిషన్‌గా న్యాయస్థానం స్వీకరించి విచారణ చేస్తుంది.
ఏపీలో పవన్ కళ్యాణ్‌తో బీజేపీకి పొత్తు ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మరోసారి స్పష్టం చేశారు. పొత్తులపై నిర్ణయం అధిష్ఠానానిదే అని ఆమె చెప్పారు.జనసేనతో బంధుత్వం లేదు అని అధిష్టానం చెపితే లేనట్టేనని.. పవన్‌తో బంధుత్వంపై అధిష్టానం చెపితే మీకూ చెపుతామని మీడియా ముందు పురంధేశ్వరి తెలిపారు.
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్ అంశంపై మంత్రి బొత్స సత్యనారాయణ విద్యా శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అసెంబ్లీలోని బొత్స సత్యనారాయణ ఛాంబర్లో కీలక సమీక్ష చేపట్టారు. ఈ కీలక సమావేశానికి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హాజరయ్యారు.
ప్రతీ ఒక్కరి జీవితంలో ఒకేసారి వచ్చే అపూరమైన వేడుక పెళ్లి. ఈ పెళ్లిని కలకాలం గుర్తుండిపోయేలా చేసుకోవాలనుకుంటారు ప్రతీ ఒక్కరు. అలాంటి మధుర జ్నాపకాల కోసం లక్షలు ఖర్చు పెడుతుంటారు. పెళ్లి కుదిరినప్పటి నుంచి ప్రతీ ఈవెంట్‌ని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు.