ఎవరైనా వివాహ వార్షికోత్సవాన్ని అందంగా ఇంట్లో సెలబ్రేట్ చేసుకుంటారు. అందరి సమక్షంలో వేడుకను జరుపుకుంటారు. కానీ ఈ జంట వినూత్న రీతిలో వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరంలోని నాగ్లా కాలీ ప్రాంతంలో రోడ్డుపై మురికి కాలువ, చెత్తాచెదారం మధ్య ఓ జంట వధూవరుల వేషధారణలో తమ 17వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. అపరిశుభ్రత, చెత్త కుప్పల వైపు జిల్లా యంత్రాంగం దృష్టిని ఆకర్షించేందుకు దంపతులు ఇలా చేశామని తెలిపారు. దంపతులు ఒకరికొకరు పూలమాలలు వేసుకున్నట్లు…
కేంద్రప్రభుత్వం రూ.715 కోట్లతో.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు చాలా వేగంగా సాగుతున్నాయి. గతేడాది ప్రధానమంత్రి చేతుల మీదుగా.. ఈ రైల్వే స్టేషన్ ను అట్టహాసంగా ప్రారంభించుకున్నసంగతి తెలిసిందే. ఈ అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తిచేసేందుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక చొరవతీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు దక్షిణమధ్యరైల్వే జీఎం, ఇతర అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం మూడు దశల్లో స్టేషన్ నిర్మాణ పనులను సంకల్పించగా.. మొదటిదశ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కేంద్రమంత్రి కిషన్…
అండర్ 19 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ కు చేరుకుంది. సెమీస్‌లో దక్షిణాఫ్రికాపై 3 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది. దీంతో.. ఉదయ్ సహారన్ సారథ్యంలోని టీమిండియా ఫైనల్‌కు చేరుకుంది. కాగా.. ఈనెల 11న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే.. పాకిస్తాన్-ఆస్ట్రేలియా మధ్య సెమీస్ మ్యాచ్ జరిగితే, ఆ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే అది ఫైనల్ కు చేరుకుంటుంది. ఫైనల్లో ప్రత్యర్థి జట్టును పాకిస్తాన్ ను ఓడించినా.. ఆస్ట్రేలియాను ఓడించినా భారత్…
రాజ్యాంగ బద్ధంగా నియమితుడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకులు పిచ్చెక్కినట్లు మాట్లాడుతున్నారని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావడాన్ని మింగుడుపడక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సభలో తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ తో కలిసి మధుయాష్కీ పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్…
బెంగళూరులో భారత హాకీ జట్టు ఆటగాడిపై పోక్సో కింద కేసు నమోదైంది. భారత హాకీ టీమ్ డిఫెండర్ వరుణ్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదైంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి గత ఐదేళ్లుగా పలుమార్లు అత్యాచారం చేశాడని బాధిత బాలిక జ్ఞానభారతి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
సంగారెడ్డి జిల్లాలో మరోసారి భూకంపం వచ్చింది. 10 రోజుల వ్యవధిలో భూకంపం రెండు సార్లు వచ్చింది. న్యాల్కల్ మండలంలో గత నెల 27న భూకంపం రాగా.. కాసేపటి క్రితం పలు చోట్ల భూమి కంపించింది. ఐదు సెకన్ల పాటు భారీ శబ్దంతో భూమి కంపిచింది. దీంతో ఒక్కసారిగా స్థానికులు భయపడి బయటకు పరుగులు తీశారు. పది రోజుల వ్యవధిలో రెండుసార్లు భూ ప్రకంపనలు రావడంతో గ్రామస్తుల్లో ఆందోళన నెలకొంది.
జనవరి 22న రామ్‌లల్లాకు పట్టాభిషేకం జరిగినప్పటి నుంచి రోజుకు సగటున 2 లక్షల మంది భక్తులు అయోధ్యను సందర్శిస్తున్నారు. దీని కారణంగా హోటళ్లు, రెస్టారెంట్లు సహా ఇతర వ్యాపారాలు పెరిగాయి. అనేక అంతర్జాతీయ బ్రాండ్లు తమ ఔట్లెట్లను అయోధ్యలో తెరవాలని ప్లాన్ చేస్తున్నాయి. డొమినోస్, పిజ్జా హట్ వంటి చైనీస్ ఫుడ్ రెస్టారెంట్లు ఏర్పాటయ్యాయి. ఇప్పుడు ఫ్రైడ్ చికెన్ ఐటెమ్‌లకు ప్రసిద్ధి చెందిన అమెరికన్ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం కేఎఫ్‌సీ తన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తోంది. అయితే..…
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఈనెల 10 నుండి మరోసారి యాత్రకు సిద్ధమయ్యారు. ప్రజాహితమే లక్ష్యంగా…. కేంద్ర అభివ్రుద్ధి పథకాలను జనంలోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా…. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంపై తిరిగి కాషాయ జెండా ఎగరేయడమే అంతిమంగా ఈ యాత్ర కొనసాగనుంది. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మండలాలను, వీలైనన్ని ఎక్కువ గ్రామాల్లో పాదయాత్ర చేసేలా రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకున్నారు. అందులో భాగంగా కొండగట్టు అంజన్న సన్నిధిలో పూజలు నిర్వహించి…
ప్రయాణికులు చైన్ లాగా రైలును ఆపిన సంఘటనలు చాలా వినే ఉంటాం. ఏదైనా అత్యవసరమైతేనే చైన్ లాగుతారు. కానీ ఒక హంస మాత్రం ఎలాంటి సాయం లేకుండా వెళ్తున్న రైలును ఆపింది. ఇదెక్కడి ఆశ్చర్యమని అనుకుంటున్నారా.. ఇది నిజం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది.
సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ కేసు విచారణకు తెలంగాణ మంత్రి దామోదర రాజ నర్సింహ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ అంశంపై తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. ఢిల్లీలో న్యాయవాదులతో మాట్లాడాం.. సుప్రీంకోర్టు కు హాజరై వాదనలు విన్నాం.. వాదనలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు. తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్…