ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. ఒక రోజు పాటు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీపీ ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. ధరల పెరుగుదలపై చర్చించాలని సభలో టీడీపీ డిమాండ్ చేసింది.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌లపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ఫైర్ అయ్యారు. జగన్ జనంలోకి వెళుతుంటే టీడీపీ, జనసేన షేక్ అవుతున్నాయని ఆయన అన్నారు. 2014లో ఉమ్మడి పోటీగా ఇచ్చిన హామీల్లో ఒకటైనా నెరవేర్చారా అంటూ ప్రశ్నించారు.
ఇవాళ సర్పంచుల ఛలో అసెంబ్లీ తరుణంలో నిన్నటి నుంచే సర్పంచులను హౌస్ అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఏపీ సర్పంచుల సంఘం అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్ర ప్రసాద్‌ను నిన్ననే(సోమవారం) హౌస్ అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న సర్పంచులను అక్కడే హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు.. హై అలర్ట్ ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సర్పంచులు డిమాండ్ల పరిష్కారం కొరకు చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు.
కుటుంబంలో రేగిన కలతలు చివరకు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి పల్నాడు జిల్లాలో ఓ కుటుంబంలో రేగిన వివాదం విషాదంగా మారింది. మాచర్ల మండలం నారాయణపురం తండాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు కన్న తల్లి కోపానికి బలైయ్యారు.... కుటుంబ కలహాలతో కన్నతల్లి, తన ముగ్గురు పిల్లలకు, భర్తకు కూడా టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారం (ఆర్ఐఎన్ఎల్) అమ్మకానికి ఈవోఐ (ఆసక్తి వ్యక్తీకరణ) జారీ చేయలేదని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పష్టం చేశారు. సేలం స్టీల్ ప్లాంట్, దుర్గాపూర్ అల్లాయ్ స్టీల్ ప్లాంట్, భద్రావతిలోని విశ్వేశ్వరాయ స్టీల్ ప్లాంట్లలో పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వం ఉపసంహరించుకున్న నేపధ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం విక్రయానికి సంబంధించి కొనుగోలుదార్ల నుంచి ఈవోఐ జారీ చేసే ప్రక్రియను ప్రభుత్వం విరమించుకున్నదా అని రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన…
స్వార్థ రాజకీయ ప్రయోజనాల సాధన కోసం పార్లమెంటరీ సంప్రదాయాలను సైతం తుంగలో తొక్కి హేతుబద్ధత లేకుండా అశాస్త్రీయంగా ఆంధ్రప్రదేశ్ విభజనకు పాల్పడిన కాంగ్రెస్ పార్టీని రాష్ట్ర ప్రజలు ఏనాటికీ క్షమించబోరని వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయి రెడ్డి విమర్శించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా పొందలేకపోవడానికి కారణం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోర తప్పిదమే కారణమని ఆయన అన్నారు.
నేడు భారత ప్రధాని నరేంద్ర మోడీ గోవాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ‘ఇండియా ఎనర్జీ వీక్ 2024’ను ప్రారంభించనున్నారు. అంతేకాకుండా.. 1,350 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. సోమవారం సమావేశాలు ప్రారంభం కాగా.. తొలిరోజు సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. నేడు ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది ఏపీ అసెంబ్లీ.. పలు శాఖలకు సంబంధించిన అన్యువల్ రిపోర్ట్స్‌ను సభ ముందు పెట్టనుంది ప్రభుత్వం .. గవర్నర్ ప్రసంగం పై ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.
హరీశ్ రావు లాగా పెట్రోల్ ముందు పోసుకున్నట్లు నటించి వేరే వాళ్ల చావుకు కారణం కాలేదని, పోసుకుని చచ్చిపోతా అని నాటకాలు ఆడలేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో కూడా వాళ్ళు అందరూ బ్లాక్ మైలర్స్ గా ఉన్నారని, ఆ బ్లాక్ మెయిల్ వివరాలు కూడా బయట పెట్టాల్సి వస్తదన్నారు. తెలంగాణ రావడానికి మూల కారణం… ఆల్ పార్టీ లో కేంద్రాన్ని ఒప్పించింది ఉత్తమ్ కుమార్ రెడ్డే. అవిషయం…