MRO Ramanaiah Family: ఏపీలో తహశీల్దార్ రమణయ్య హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హత్యకు గురైన ఎమ్మార్వో రమణయ్య కుటుంబానికి ఏపీ ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం ప్రకటించింది. రమణయ్య కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా, విశాఖ జిల్లా కొమ్మాదిలో ఎమ్మార్వో రమణయ్య దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు అర్ధరాత్రి ఆయన ఇంట్లోకి చొరబడి రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ఎమ్మార్వో రమణయ్య మరణించాడు. ఎమ్మార్వో రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారీ సుబ్రమణ్యంను విశాఖ పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఓ భూ వివాదంలో కంబైన్డ్ డీడ్ చేయడంలో రమణయ్య జాప్యం చేయడం వల్లే ఈ హత్య జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
Read Also: AP Budget 2024: ఏడు అంశాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన.. చాణక్యుడి పాలన అందిస్తున్నాం..