మాదాపూర్‌లోని సమతా మూర్తి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ చిట్టీల పేరుతో మోసాలకు పాల్పడింది. ఈ నేపథ్యంలో సమత మూర్తి చిట్ ఫండ్ ఇద్దరు నిర్వాహకులు శ్రీనివాస్ రాకేష్ అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా మాదాపూర్ డీపీసీ వినీత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాదాపూర్ డీసీపీ వినీత్ మాట్లాడుతూ.. మాదాపూర్ లో వేల్పుల శ్రీనివాస్ రాకేష్ గణేష్ డైరెక్టర్ లుగా ఏర్పడి సమత మూర్తి చిట్ ఫండ్ పేరుతో సంస్థ ఏర్పాటు చేశారన్నారు. ఎవరికైతే ఆర్థిక అవసరాలను చేసుకుని చిట్టి ద్వారా మోసాలు చేశారని ఆయన పేర్కొన్నారు. ఖాతాదారులను మోసం చేయడం ద్వారా సుమారు ఐదు కోట్ల వరకు దండుకున్నారని ఆయన అన్నారు. దాదాపు ఇప్పటి వరకు 120 వరకు బాధితులు ఉన్నట్టు ఐడెంటిఫై చేసామని ఆయన తెలిపారు. ఇందులో కొంత మంది బాధితుల స్టేట్మెంట్ రికార్డు చేసామని, ఇప్పటివరకు ఐదు కోట్ల మోసం జరిగింది విచారణలో మోసం విలువ పెరగవచ్చని ఆయన అన్నారు. శ్రీనివాస్ రాకేష్ లను అరెస్ట్ చేసి రిమాండ్ చేసామని ఆయన తెలిపారు. మొబైల్ ఫోన్స్ సీజ్ చేసాం గణేష్ పరారీలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు వారిని కూడా ఆదుపులోకి తీసుకుంటామని, అమాయకులకు డబ్బు ఆశ చూపి చిట్ఫండ్ నిర్వాహకులు మోసాలకు పాల్పడుతున్నారన్నారు. మాదాపూర్ జోన్‌లో ఇలాంటివి ఆరు కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. వాళ్లను కూడా అరెస్ట్ చేస్తామని, గత ఆరు నెలలుగా నిందితులు చిట్ఫండ్ సంస్థ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారన్నారు. మాదాపూర్ కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌లో బ్రాంచెస్ ఓపెన్ చేశారని, తెలిసిన పరిచయస్తుల ద్వారా అలానే ఆన్లైన్ ద్వారా ఖాతాదారులను చేర్చుకున్నారన్నారు. నెలవారీగా డబ్బులు వచ్చే స్కీమ్స్ ఉన్నాయని ఖాతాదారులను నమ్మించారని, మొదట రెండు మూడు నెలలు సక్రమంగా డబ్బులు ఇచ్చి ఆపై మోసాలకు పాల్పడ్డారన్నారు. సమత మూర్తి పేరుతోపాటు చిన్న జీయర్ పేరు కూడా వాడారు వారికి ఈ చిట్ ఫండ్ కి ఎలాంటి సంబంధం లేదన్నారు. దోచుకున్న డబ్బు ఎక్కడ ఉందో సమాచారం ఉందని, బాధితులకు అప్పగించే ప్రయత్నం చేస్తామన్నారు. చిట్‌ఫండ్ మోసాల పట్ల జనాల అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు.