రేపు మధ్యాహ్నం (శుక్రవారం) సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో భాగంగా.. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు.
ముక్కోటి ఏకాదశి ఉత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలు ముస్తాబవుతున్నాయి. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ముస్తాబవుతుంది. రేపు ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా సీతా రామ చంద్రస్వామి వారికి.. ఈరోజు సాయంత్రం గోదావరిలో హంస వాహన సేవ కొనసాగనుంది. సాయంత్రం భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయం నుంచి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపుగా గోదావరి నదికి చేరుకుంటాయి. గోదావరి నదిలో ఏర్పాటు చేసిన హంస వాహనంపై స్వామివారి వేంచేసి.. గోదావరిలో విహరించుతారు.
కేసీఆర్ కుటుంబంపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కల్వకుంట్ల తారక రామారావు అలియాస్ కేటీఆర్ ఒక డ్రామా ఆర్టిస్ట్ లాగా గుర్తింపు పొందారని ఆరోపించారు. సుప్రీంకోర్టు, హైకోర్టులలో కేటీఆర్‌కు ఊరట లభించలేదు.. అందుకే మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని కేటీఆర్‌ను దుయ్యబట్టారు.
హైదరాబాద్ జీహెచ్ఎంసీ (GHMC ) కార్యాలయంలో కాంట్రాక్టర్లు నిరసన చేపట్టారు. బిల్లులు చెల్లించడం లేదంటూ కాంట్రాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు కమిషనర్‌ను కలిసేందుకు జీహెచ్ఎంసీ కార్యాలయంలోకి వచ్చే ప్రయత్నం చేశారు. దీంతో.. సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకుని గేట్లకు తాళం వేశారు. ఈ క్రమంలో.. ఓ కాంట్రాక్టర్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేశాడు.
నీ దర్శనానికి వచ్చిన భక్తులకు ఏర్పాట్లు చేయలేనందుకు మమ్ములను క్షమించండి స్వామీ.. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి టోకెన్ల జారీ కౌంటర్ల వద్ద జరిగిన ఘటన తిరుపతి వాసుల్లో కలకలాన్ని రేపింది. తాజాగా ఈ అంశంపై ఏపీ బీజేపీ స్పందించింది. “ఏడు కొండలు వాడా… స్వామి మమ్ముల్ని క్షమించు… భక్తకోటిని క్షమించండి. నీ దర్శనానికి వచ్చిన వారికి ఏర్పాట్లు చేయలేనందుకు మమ్ములను క్షమించు.” అని కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని…
సైలెంట్ గా షూటింగ్ మొదలెట్టిన మహేశ్ బాబు సూపర్ స్టార్ మహేశ్ బాబు తన లేటెస్ట్ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించి పూజ కార్యక్రమాలను కూడా సైలెంట్ గా పూర్తి చేసారు. తన ఆనవాయితీగా భిన్నంగా రాజమౌళి సినిమాను గుట్టు చప్పుడు కాకుండా స్టార్ట్ చేసాడు. ఈ సినిమా ఎప్పుదెప్పుడు స్టార్ట్ అవుతుందా అని సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్ ఏంతో ఈగర్ గా…
నేడు ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్. విచారణకు లాయర్‌ను తీసుకెళ్లేందుకు కోర్టు అనుమతి. ఏసీబీ ఎంక్వయిరీ సర్వత్రా ఉత్కంఠ. నిన్న 7 గంటల పాటు అరవింద్ కుమార్ ఏసీబీ విచారణ. BLNరెడ్డిని 9 గంటలు ప్రశ్నించిన ఈడీ. వనపర్తి జిల్లాలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన. వనపర్తి నియోజకవర్గంలో పలు సబ్ స్టేషన్లను ప్రారంభించనున్న భట్టి. కృష్ణా: పోలీసుల కస్టడీ పిటిషన్‌పై నేడు జిల్లా…
గతం గతః.. మోహన్ బాబు కామెంట్స్ వైరల్! తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు వేడుకగా జరిగాయి. యూనివర్సిటీలో ముగ్గుల పోటీలు, ఆటల పోటీలతో సందడి నెలకొంది. విద్యార్థులు సంక్రాంతి సంబరాల్లో పాల్గొని ఎంజాయ్ చేశారు. ఈ సంక్రాంతి వేడుకల్లో మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్, సినీ నటుడు మోహన్‌బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వేదికపై ఆయన మాట్లాడారు. గతం గతః అనే వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ‘గతం గతః. నిన్న జరిగింది మర్చిపోను, నేడు…