England vs Sri Lanka: శ్రీలంకను వణికించిన ఇంగ్లాండ్ స్పిన్నర్లు.. 95 పరుగులకే కుప్పకూలిన లంక!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
England vs Sri Lanka: టీ20 ప్రపంచ కప్ సూపర్-8 పోరులో ఇంగ్లాండ్ జట్టు ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. బ్యాటింగ్‌లో తడబడ్డా.. బౌలింగ్‌లో అద్భుతమే చేసి శ్రీలంకను చిత్తు చేసింది. కేవలం 146 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకుంటూ, లంకను 95 పరుగులకే కుప్పకూల్చి 51 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. తక్కువ స్కోరే కదా అని తేలికగా తీసుకున్న శ్రీలంకకు నిజానికి ఇంగ్లాండ్ బౌలర్లు చుక్కలు చూపించారు. కేవలం 146 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ స్పిన్నర్లు హిమాలయమంత భారీ స్కోరుగా మార్చేశారు. పల్లెకెలె వేదికగా జరిగిన సూపర్-8 పోరులో విల్ జాక్స్, ఆదిల్ రషీద్ ధాటికి లంక బ్యాటర్లు క్రీజులోకి రావడం, వెళ్లడం అన్నట్లుగా సాగింది. చివరకు 95 పరుగులకే లంక చేతులెత్తేయడంతో ఇంగ్లాండ్ 51 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. ఈ గెలుపుతో శ్రీలంకపై తమ ఆధిపత్యాన్ని చాటుతూ వరుసగా 12వ విజయాన్ని నమోదు చేసింది ఇంగ్లాండ్.
Also Read
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
- VIVO Smart Phones: 6.59 అంగుళాల OLED డిస్ప్లే, 7000mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.. VIVO నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Oppo F35 Series: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్.. మార్కెట్లోకి Oppo నుంచి రెండు స్మార్ట్ ఫోన్స్..
- Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే
సాల్ట్ మెరుపులు.. వెలలాగే స్పిన్ మ్యాజిక్
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌కు శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెలలాగే (3/26) చుక్కలు చూపించాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా ఓపెనర్ ఫిల్ సాల్ట్ (40 బంతుల్లో 62) ఒంటరి పోరాటం చేశాడు. సాల్ట్ మినహా మిగిలిన బ్యాటర్లెవరూ లంక బౌలింగ్‌ను తట్టుకోలేకపోవడంతో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులు మాత్రమే చేయగలిగింది.
పేకమేడలా కూలిన లంక బ్యాటింగ్
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ వేగానికి, విల్ జాక్స్ స్పిన్ ధాటికి లంక టాప్ ఆర్డర్ పేకమేడలా కూలిపోయింది. పవర్‌ప్లే ముగిసేసరికి 34 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. కెప్టెన్ దాసున్ షనక (30) కాసేపు ప్రతిఘటించినా ఫలితం లేకపోయింది. ఇంగ్లీష్ స్పిన్నర్లు ఆదిల్ రషీద్ (2/13), విల్ జాక్స్ (3/22), లియామ్ డాసన్ (2/27) సమిష్టిగా విరుచుకుపడటంతో శ్రీలంక 16.4 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ అయింది. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో శ్రీలంకకు ఇది మూడవ అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ స్పిన్నర్లు ఏకంగా 7 వికెట్లు పడగొట్టారు. టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఇంగ్లీష్ స్పిన్నర్లకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అటు బ్యాటింగ్‌లో విఫలమైనా.. బౌలింగ్‌లో మ్యాజిక్ చేసిన విల్ జాక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు.
READ ALSO: Allu Arjun: మెగా రికార్డుకు రీచ్ అయిన పుష్పరాజ్.. తగ్గేదే లే అంటున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
-
Vijay Deverakonda: క్యారెక్టర్ కోసం ఇంత రిస్కా? ‘రణబాలి’ సెట్లో చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ దేవరకొండ!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!