Heart Attack: ఒకప్పుడు గుండెపోటు అంటే వయసు పైబడిన వారికి వస్తుందని అనుకునే వాళ్లం. కానీ, ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా రావడం ఆందోళనలు పెంచుతోంది. ఇటీవల పలు సందర్భాల్లో యుక్త వయస్కులు గుండెపోటుకు గురై మరణించారనే వార్తలు వింటూనే ఉన్నాం. చివరకు స్కూల్ పిల్లలు మరణించడం సమస్య తీవ్రతను పెంచుతోంది.
రైతు భరోసా అమలుకు చర్యలు వేగవంతం చేయాలి: మంత్రి వ్యవసాయ, అనుబంధ రంగాల ప్రగతిపై అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యత ఎరిగి పనిచేయాలని హితవు పలికారు. రైతులు, ప్రజా ప్రతినిధుల, మంత్రివర్యుల నుంచి వచ్చే విజ్ఞప్తులపై సత్వరమే పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. పరిష్కారంలో జాప్యం పై అసహనం వ్యక్తం చేశారు. అధిక మొత్తంలో సన్న, చిన్నకారు రైతుల ప్రయోజనం అందేలా వ్యవసాయ యాంత్రికరణను, సూక్ష్మ సేద్య పరికరాలకు…
సంక్రాంతికి ఊరెళ్లే వారికి ఏపీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. సంక్రాంతి సందర్భంగా.. ఎటువంట అదనపు ఛార్జీలు లేకుండా, సాధారణ ఛార్జీలతోనే సంక్రాంతి ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ తెలిపింది. సంక్రాంతి పండగ దృష్ట్యా.. 7,200 ప్రత్యేక సర్వీసులను నడిపేందుకు ఏపీఎస్ ఆర్టీసీ కార్యాచరణ రూపొందించింది.
విశాఖలో ప్రధాని సభా వేదిక ఏర్పాట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణ కోసం మంచి ప్యాకేజీ కేంద్రం ప్రకటిస్తుందని తెలిపారు. ఉక్కు ఉద్యోగుల జీతభత్యాల చెల్లింపులో ఇబ్బందులు ఉన్నాయన్న విషయం కేంద్రమంత్రి దృష్టికి తీసుకుని వెళతామని అన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల జరిగే అభివృద్ధి నమూనాకు ఆంధ్రప్రదేశ్ ఉదాహరణ అని పురందేశ్వరి తెలిపారు.
కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి విడదల రజని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పేద వాడికి కార్పొరేట్ వైద్యం అందాలని ఆశయంతో.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకంను ప్రారంభించారని తెలిపారు.
హైందవ శంఖారావం సభలో పెద్ద ఎత్తున హిందువులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. అయితే.. పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలను మాజీమంత్రి కొట్టు సత్యనారాయణ ఖండించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వ్యక్తులు ఎవరు రాజకీయ కోణంలో మాట్లాడలేదని.. కేవలం పురంధేశ్వరి మాత్రమే చంద్రబాబు ప్రాపకం కోసం తమ పార్టీపై బురద చల్లాలని చూశారని ఆరోపించారు.
తెలంగాణ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు గూండాలు, రౌడీల్లాగా వ్యవహరిస్తూ.. రాళ్లతో, కర్రలతో చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇది పిరికిపిందల చర్య.. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ తన తీరును మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నానని అన్నారు.
హనుమకొండలో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సును ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు.
హనుమకొండ జిల్లా హయగ్రీవ గ్రౌండ్లో ఆర్టీసీ 50 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు. ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, నాగరాజు, ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. వరంగల్‌కి 112 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించింది ప్రభుత్వం.
చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. చర్లపల్లి టెర్మినల్ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. రైల్వే టెర్మినల్ పూర్తి చేసినందుకు ప్రధానికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.