Hindus: అమెరికాలో విద్యాధికులు హిందువులే..
- అమెరికాలో విద్యాధికులు హిందువులే..
- తర్వాతి స్థానంలో యూదులు..
- తాజా అధ్యయనంలో కీలక విషయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hindus: అమెరికాలో అత్యధిక విద్యావంతులు హిందువులే అని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. మతాలపై చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ (Pew Research Center) ఇటీవల విడుదల చేసిన ‘2023-24 రిలిజియస్ ల్యాండ్‌స్కేప్ స్టడీ’లో అమెరికాలో వివిద మతాల విద్యాస్థాయిలపై ఆసక్తికరమైన గణాంకాలు వెల్లడయ్యాయి. జూలై 17, 2023 నుంచి మార్చి 4, 2024 మధ్యలో మొత్తం 36,908 మంది అమెరికన వయోజనుల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నివేదిక వెల్లడైంది.
అమెరికా సగటుతో పోలిస్తే, ఆ దేశంలో ఉన్న హిందువులు బ్యాచిలర్ డిగ్రీ, అంతకన్నా ఎక్కువ విద్యను పూర్తి చేస్తున్నారు. హిందువులు 70 శాతం, యూదులు 65 శాతంతో ముందు వరసలో ఉన్నారు. యూఎస్‌లోని ప్రతీ 10 మంది హిందువుల్లో ఏడుగురు బ్యాచిలర్ డిగ్రీ లేదా అంతకన్నా ఎక్కువ విద్యను కలిగి ఉన్నారు. యూఎస్ సగటు చూస్తే ఇది 35 శాతం మాత్రమే ఉంది.
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
Read Also: Jowar Recipes: “జొన్న గుగ్గిళ్లు” ట్రై చేయండి.. వెయిట్ లాస్, షుగర్ కంట్రోల్‌కు బెస్ట్ రెసిపీ..
అమెరికా సగటు కన్నా ఎక్కువ విద్యను కలిగి ఉన్న మతాల్లో ముస్లింలు, బౌద్ధులు, ఆర్థడాక్స్ క్రిస్టియన్స్ ఉన్నారు. ప్రధాన ప్రొటెస్టంట్ క్రైస్తవులు కూడా జాతీయ సగటు కన్నా ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇక ఎవాంజెలికల్ ప్రొటెస్టంట్స్, క్యాథలిక్కులు, బ్లాక్ ప్రొటెస్టంట్స్‌ల గ్రాడ్యుయేట్ల వాటా జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందని అధ్యయనం తెలిపింది.
ఈ విద్యా వ్యత్యాసాలకు ప్రధానంగా వలస విధానం కారణమని నివేదిక తెలిపింది. హిందువులు, ముస్లింలు, బౌద్ధులలో చాలా మంది ఉన్నత విద్యా, స్కిల్డ్ వర్కర్ వీసాలు(H-1B వంటివి) ద్వారా అమెరికా వెళ్లారు. దీనివల్ల ఆయా కమ్యూనిటీల్లో సహజంగా విద్యావంతుల సంఖ్య ఎక్కువగా ఉంది. అమెరికా మొత్తం జనాభాలో క్రైస్తవులు దాదాపుగా 70 శాతం ఉండగా, యూదులు 2 శాతం, ముస్లింలు 1.3 శాతం, హిందువులు 1 శాతంలోపే ఉన్నారు. అయినప్పటికీ వీరంతా విద్యాపరంగా ముందంజలో ఉన్నారు.
తాజావార్తలు
-
Delhi: జర్నలిస్ట్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలో బిగ్ ట్విస్ట్.. పోలీస్ బాస్‌కు ప్రమోషన్
-
ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
-
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
-
Low Budget Phones: 8000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ చార్జింగ్, 144Hz రిఫ్రెష్ రేట్.. తక్కువ ధరలో అందుబాటులోకి..
-
WI Vs IND: రేపే వెస్టిండీస్‌తో తొలి టీ20.. భారత్ నుంచి ఎవరెవరు ఆడుతున్నారంటే..?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!