నా వల్ల కూడా తప్పులు జరిగాయ్.. నేనూ మనిషినే, దేవుడిని కాదు.. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు. నిఖిల్ ఈ ఇంటర్వ్యూ ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఇందులో ప్రపంచంలోని యుద్ధ పరిస్థితులు, రాజకీయాల్లోకి యువత ప్రవేశం, మొదటి, రెండవ టర్మ్ పాలన మధ్య వ్యత్యాసంపై ప్రధాని మోడీ స్పందించారు. ఆ ఇంటర్వ్యూలో ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను మొదటి సారి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూకి…
ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తెలుగు కుర్రాడు.. అరంగేట్రంలోనే దిగ్గజ ఆటగాడితో ఢీ! టెన్నిస్ క్యాలెండర్‌లోని మొదటి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆ్రస్టేలియన్ ఓపెన్ 2025 షెడ్యూల్ గురువారం విడులైంది. జనవరి 12 నుంచి 26 వరకు టోర్నీ సాగనుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో తెలుగు మూలాలున్న అమెరికా కుర్రాడు నిశేష్ బసవారెడ్డి బరిలోకి దిగుతున్నాడు. గ్రాండ్‌స్లామ్ అరంగేట్రంలోనే దిగ్గజ ఆటగాడు నొవాక్ జకోవిచ్‌తో పోటీపడబోతున్నాడు. 19 ఏళ్ల నిశేష్ వైల్డ్ కార్డుతో గ్రాండ్‌స్లామ్ అరంగేట్రం చేయనున్నాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను రికార్డు స్థాయిలో…
నేడు జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ వీడియో కాన్ఫరెన్స్. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లపై చర్చ. ఈనెల 17న సింగపూర్ వెళ్లనున్న సీఎం రేవంత్. సికింద్రాబాద్ – విశాఖ వందేభారత్‌ను ఆప్‌గ్రేడ్ చేసిన రైల్వే శాఖ. ఇవాళ్లి నుంచి అందుబాటులో 4 అదనపు కోచ్‌లు. 20 కోచ్‌లతో రెగ్యులర్ ట్రైన్‌గా వందేభారత్ రాకపోకలు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో పెరిగిన రద్దీ. గోవింద నామస్మరణతో మారుమోగుతున్న తిరుమల కొండ. ఉదయం 9 గంటల నుంచి…
తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నెల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
తెలంగాణలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగనున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ క్రమంలో.. నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ సీఈవో శివ శంకర్ లోతేటి చర్చలు జరిపారు. పేషెంట్లకు ఇబ్బంది కలిగించకుండా వైద్య సేవలు అందించాలని సీఈవో విజ్ఞప్తి చేశారు.
తెలంగాణలో బీర్ల సరఫరా నిలిపివేతపై యూబీఎల్ (United Breweries Limited) వివరణ ఇచ్చింది. 2019 నుంచి తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ధరలు పెంచలేదని తెలిపింది. కొన్ని నెలలుగా నష్టాలు భరిస్తూ బీర్లు సరఫరా చేశాం.. ధరలు సవరించాలని టీజీబీసీఎల్‌ను అనేక సార్లు కోరామన్నారు.
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలను చెల్లించకపోవడాన్ని బండి సంజయ్ తప్పుపట్టారు. విద్య, వైద్యం విషయంలో కాంగ్రెస్ తీరు కోట్లాది మంది ప్రజలను తీవ్రమైన ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా న్యూ రూల్స్ తీసుకొచ్చింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఖాతాదారుల ఫిర్యాదులను గడువులోగా పరిష్కరించకుంటే జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ జరిమానాను ఖాతాదారులకు పరిహారంగా అందించనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. ఆర్బీఐ ఆదేశాలతో ఖాతాదారులకు బ్యాంకులు ఇకపై రోజుకు రూ. 100 చెల్లించనున్నాయి. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం బ్యాంకులు కస్టమర్ ఫిర్యాదులను ఒక నెలలోపు పరిష్కరించాలి. ఆ లోపు సమస్య పరిష్కారం కాకపోతే రోజుకు రూ.100 జరిమానా…
తెలంగాణలో బీజేపీ సంస్థాగత ఎన్నికలపై తీవ్రమైన దృష్టి పెట్టింది. పార్టీని బలోపేతం చేసేందుకు మండల అధ్యక్షులను ప్రకటించింది. అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత రాష్ర్ట పార్టీ అప్రూవల్ తీసుకొని బీజేపీ మండల అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది.
ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ ఈరోజు ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఏడు గంటల పాటు కేటీఆర్ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం బయటికొచ్చి మీడియాతో మాట్లాడారు. అనంతరం.. అక్కడి నుంచి తెలంగాణ భవన్‌కు వచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇన్వెస్టిగేషన్లో తనను ఏం ప్రశ్నలు అడగాలో తెలియక ఏసీబీ అధికారులు ఇబ్బందులు పడ్డారని కేటీఆర్ తెలిపారు.