లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు రాలేని చెప్పారు. దర్యాప్తు సంస్థ ఇచ్చిన సమన్లకు ఇవాళ ఆయన ఈడీ కార్యాలయానికి వెళ్లాల్సి ఉండగా.. తాను హాజరుకావడం లేదని సీఎం చెప్పారు.
పాకిస్థాన్‌లోని లాహోర్‌లో యువతి డ్రెస్ పై అరబిక్ భాషలో ఖురాన్‌ను కించపరిచే రాతలున్నాయన్న ఆరోపణలతో కొందరు చుట్టుముట్టారు. వెంటనే ఓ మహిళా పోలీసు ఆ యువతిని ఆ మూక నుంచి రక్షించింది.
లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు హస్తం పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) లో చేరారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ‘హెల్త్ ఆన్ అస్’ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇంటి వద్దే ఫిజియోథెరఫీ, నర్సింగ్ సేవలు, ట్రీట్మెంట్ తరువాత చేసే వైద్య సేవలు చేయనుంది హెల్త్ ఆన్ అజ్ సంస్థ.. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. అందరూ బాగుండాలి అని కోరుకునే వాడినని అన్నారు. అందరికి ఆరోగ్యం అందుబాటులో ఉండాలని కోరుకునే వాడినని తెలిపారు. సమాజంలో అందరికీ ఆరోగ్య…
బ్యాంక్ కస్టమర్లకు బ్యాంకుల్లో ఎప్పుడూ ఏదో పని ఉంటూనే ఉంటుంది. అందుకే బ్యాంకుల్లో ఏదైనా పని కోసం వెళ్లాలంటే.. ముందుగా బ్యాంక్ సెలవులపై అవగాహన ఉండాలి. బ్యాంక్ ఏరోజు పనిచేస్తుందో.. ఏరోజు సెలవు ఉందో తెలుసుకోవాలి. ఇప్పుడు ఫిబ్రవరి నెలలో ఇంకొన్ని రోజులే ఉన్నాయి. అందుకే ఇప్పుడు మార్చి నెలలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి.
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఎంఎస్ ధోని ఇండియాలోనే కాదు ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరు. ధోనీని అందరూ కెప్టెన్ కూల్ అని పిలిచేవారు. ధోనీ కెప్టెన్సీలో మూడు ఫార్మాట్లలో (టీ20 ప్రపంచకప్ 2007, ప్రపంచకప్ 2011, ఛాంపియన్స్ ట్రోఫీ 2013) భారత్‌ను ఛాంపియన్‌గా మార్చాడు. అంతేకాకుండా ధోనీ సారథ్యంలో భారత జట్టు టెస్టు క్రికెట్లో నంబర్‌వన్ ర్యాంక్‌ను సాధించింది.
ఇంటర్నేషనల్ నంబర్స్‌తో విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకి బెదిరింపు కాల్స్ రావడం కలకలం రేపింది. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అంతర్జాతీయ కాల్స్ ద్వారా ఫోన్ చేసి దుర్భాషలాడుతూ చంపేస్తామని బెదిరించినట్లు తెలిసింది.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. టీడీపీ-జనసేన ఉమ్మడి తొలి జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికార వైసీపీ ఓడించాలనే లక్ష్యంతో ఇరు పార్టీలు జాబితాను విడుదల చేశాయి. ఈ క్రమంలోనే సీట్లు దక్కని నేతలు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రోజంతా బుజ్జగింపులతో చంద్రబాబు బిజీ బిజీగా గడిపారు.
కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 27న చేవెళ్ల సభలో మరో రెండు గ్యారెంటీ పథకాల అమలు ప్రకటన చేస్తామని తెలిపారు. మార్చి నెలలో 200 యూనిట్లు లోపు విద్యుత్ బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. అంతేకాకుండా.. డ్వాక్రా సంఘాలకు త్వరలో వడ్డీ లేని రుణాలు అందిస్తామని చెప్పారు. రేపు సాయంత్రం 43,000 మంది సింగరేణి కార్మికులకు కోటి…