సింగరేణి సంస్థల్లో పని చేసే 43 వేల మందికి ప్రమాద వశాత్తు ఏదైనా జరిగితే కోటి రూపాయల భీమా వర్తించే పథకమన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సంక్షేమ రాజ్యానికి సాక్ష్యం ఇది అని ఆయన వ్యాఖ్యానించారు. ఆరు గ్యారెంటీలతో పాటు సింగరేణి కార్మికులకు ఇన్సూరెన్స్ ఇస్తున్నామన్నారు. కార్మికులను కాపాడుకోవడం మా భాద్యత అని ఆయన అన్నారు. అవుట్ సోర్సింగ్ కార్మికుల కు కూడా 20 నుంచి 30 లక్షల ఇన్సూరెన్స్ చేయించామన్నారు. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం లేదు. మొట్టమొదటి సారిగా అవుట్ సోర్సింగ్ కార్మికులకు ఇన్సూరెన్స్ కల్పించామన్నారు. ఇదో అద్భుతమైన కార్యక్రమని, కోటి రూపాయల ఇన్సూరెన్స్ కల్పించే పథకానికి బ్యాంకర్లతో ఎంవోయూ చేసుకున్న సింగరేణి సంస్థమన్నారు.
సింగరేణి ప్రమాద బీమా హై లైట్స్