తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన నాటి నుంచి రెవెన్యూ, ఇరిగేషన్, ఐటీ, పరిశ్రమల శాఖలో అక్రమాలు జరిగాయని ఎన్నో కథనాలు వచ్చాయన్నారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం తో అవినీతి పెరిగిపోతోందని, కాంగ్రెస్ ఇన్చార్జి ల పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. మాణిక్ రావు ఠాక్రే, ఠాగూర్ లపై ఆధారాలు ఉన్నాయని చెప్పారన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఎవ్వరిపై కూడా విచారణకు ముందుకు రాలేదని ఆయన వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ లో సూటు కేసులు , బ్రీఫ్ కేసులు.. ఫైరవిలు కామన్ అని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ, కర్ణాటక ల నుంచి కప్పం వసూళ్లపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టిందని ఆయన అన్నారు. నాకు ఎలాంటి నోటీసులు అందలేదని, నోటీసులు అందితే పార్టీతో చర్చించి సరయిన సమాధానం చెప్తానని ఆయన పేర్కొన్నారు. బీజేపీ పరువును కించపరిచేలా కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోందని, ఆధారాలు చూపెట్టాలన్నారు. బీజేపీ లీగల్ సెల్ రంగం లోకి దిగబోతోందన్నారు. నోటీసు వస్తే, లీగల్ సెల్ తో చర్చించి సమాధానం ఇస్తాననని ఆయన అన్నారు.