వీర్ సావర్కర్ వర్ధంతి సందర్భంగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి కాచిగూడలోని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలు గుర్తు చేసుకున్నారు. అనంతరం విజయ సంకల్ప యాత్రకు బయలుదేరారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం సందర్భంగా పద్మారావు నగర్ స్వరాజ్య ప్రెస్ చేరుకున్న కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. వీర తిలకం దిద్ది విజయం కాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన పద్మారావు నగర్,…
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పార్టీలు చేస్తున్న ఐవీఆర్ఎస్ సర్వేలు నాయకులకు గుబులు పుట్టిస్తున్నాయి. స్థాన బదిలీలు, కొత్త కొత్త అభ్యర్థుల పేర్ల పరిశీలనతో జరుగుతున్న సర్వేల నేపథ్యంలో పల్నాడు టీడీపీ క్యాడర్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పల్నాడు జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గంతో పాటు, నరసరావుపేట, గురజాల అసెంబ్లీ స్థానాలకు కొత్త అభ్యర్థుల పేర్లను ప్రతిపాదించింది టీడీపీ అధిష్టానం. ఇక్కడ సీనియర్ నాయకులు పేర్లను అభ్యర్థులుగా పెట్టబోతున్నాం అని సర్వేల ద్వారా పరిశీలిస్తుంది టీడీపీ.
చంద్రుడిపై జెండాను ఎగురవేసిన జపాన్‌కు చెందిన చంద్రయాన్ స్లిమ్ అద్భుతం చేసింది. చల్లని రాత్రి తర్వాత తమ అంతరిక్ష నౌక అద్భుతంగా తిరిగి ప్రాణం పోసుకున్నట్లు జపాన్ అంతరిక్ష సంస్థ జాక్సా ప్రకటించింది.
ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ (72) అనారోగ్యంతో మరణించారు. సోమవారం ఉదయం మరణించినట్లు అతని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారని.. ఉదయం 11 గంటల ప్రాంతంలో మరణించారని చెప్పారు. పంకజ్ ఉదాస్ మరణవార్తను చాలా బరువెక్కిన హృదయంతో మీకు తెలియజేసేందుకు చింతిస్తున్నామని ఆయన కుమార్తె నయాబ్ ఉదాస్ ఓ ప్రకటనను పోస్ట్ చేశారు.
అటవీశాఖ ప్రధాన కార్యాలయం అరణ్య భవన్ వేదికగా అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి అరణ్యభవన్ కు వచ్చిన మంత్రికి అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సుదీర్ఘంగా కొనసాగిన ఈ సమీక్షా సమావేశంలో ముఖ్యకార్యదర్శి వాణీ ప్రసాద్, పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్ ఎం.సీ. పర్గెయిన్, విజిలెన్స్ పీసీసీఎఫ్…
బీజేపీ ఐటీ సెల్‌కు సంబంధించిన వీడియోను రీట్వీట్ చేసినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పారు. బీజేపీ ఐటీ సెల్ గురించి యూట్యూబర్ ధృవ్ రాఠి షేర్ చేసిన వీడియోను రీట్వీట్ చేయడం తన తప్పు అని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో అంగీకరించారు.
సముద్రంలో ఈత కొట్టే సమయం ఉంది మోడీకి కానీ.. మణిపూర్ వెళ్లే సమయం మాత్రం లేదని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గుడి మీ అయ్య జాగిరా అంటూ ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీని కూడా గుడిలోకి పోకుండా అడ్డుకుంటున్నారని, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. ఖమ్మం నుండి పోటీ చేస్తానని, అక్కడి సమస్యలపై కోట్లాడిన అని ఆయన వ్యాఖ్యానించారు. చనిపోయిన రైతులకు సాయం చేసిన అని ఆయన తెలిపారు. ఏడు…
తిరుమల ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులుపై టీటీడీ వేటు వేసింది. ఆలయ కైంకర్యాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గౌరవ ప్రధాన అర్చకుడి పదవి నుంచి తొలగించింది. రమణ దీక్షితుల వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న టీటీడీ.. ఆయన్ను పదవి నుంచి తొలగించింది. మరోవైపు.. రమణ దీక్షితులుపై అహోబిలం మఠం, జియ్యంగార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజుల క్రితం రమణదీక్షితులు టీటీడీ అధికారులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, అహోబిలం మఠం, టీటీడీ జీయలర్‌లపై నీచమైన…
ఇతర దేశాల నుంచి సేకరించిన పాత క్షిపణి వ్యవస్థల స్థానంలో బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి భారత నావికాదళానికి ప్రాథమిక ఆయుధంగా ఉంటుందని భారత నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరి కుమార్ సోమవారం తెలిపారు.