కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణలో బీజేపీ, బీఆర్ఎస్ లు రోజుకు డ్రామా ఆడుతున్నాయని కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు పార్టీల డ్రామాలకు అంతం లేకుండా పోయిందని, లిక్కర్ డ్రామా లో బిజెపి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందన్నారు. మోడీ, అమిత్ షా ల ముద్దు బిడ్డ కేసీఆర్ అని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న పార్టీలపై నేతలపై దాడి చేస్తుంది బీజేపీ అని ఆయన మండిపడ్డారు.…
గాజాలో ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా ప్రధాని మహ్మద్ సయ్యే తన పదవికి ఇవాళ రాజీనామా చేసారు. దేశాధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌కు తన రాజీనామాను సమర్పించినట్లు పాలస్తీనా ప్రధాని మహ్మద్ సయ్యే తెలిపారు.
ఈరోజుల్లో భార్యాభర్తల మధ్య గొడవలు సహజం. చిన్నచిన్న మనస్పర్ధాలకే నువ్వెంత అంటే నువ్వెంత అనే పరిస్థితి వస్తుంది. ఈ క్రమంలో తొందరపాటు నిర్ణయం వల్ల విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువవుతుంది. అంతేకాకుండా.. భార్యాభర్తల మధ్య మనస్పర్ధాలు వస్తే.. భర్త గొడవ ఎందుకులేనని అనుకువుగా ఉన్నా, భార్య మాత్రం ఓ పట్టు పట్టాల్సిందే అన్నట్లు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. దీంతో భార్యల చేతుల్లో చెంపదెబ్బలు, చీపురుదెబ్బలు.. ఇలా రకరకాల దెబ్బలు తినాల్సి వస్తుంది.
బీజేపీ విజయ సంకల్ప యాత్రలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే సనత్ నగర్, ఎర్రగడ్డ మీదుగా నేడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి అమీట్ పేట్ లో మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో మళ్లీ మోదీ మళ్ళీ ప్రధాని కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. విజయ సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్రంలో 5 యాత్రలను ప్రారంభించడం జరిగిందని, ఈ రోజు విజయ సంకల్ప యాత్రలో భాగంగా…
భారత్ ఇప్పుడు పెద్ద కలల కంటోందని.. కలలను నెరవేర్చడానికి పగలు, రాత్రి పని చేస్తోందని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం సుమారు రూ.41,000 కోట్ల విలువైన 2,000 కంటే ఎక్కువ రైలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు.
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహతో గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా హెల్త్ మినిస్టర్ అంబర్ జెడ్ సండర్సన్, గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ కు చెందిన ఉన్నత స్థాయి అధికారుల బృందం హైదరాబాద్‌లోని ట్రైడెంట్ హోటల్లో సమావేశమయ్యారు. గవర్నమెంట్ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో మెడికల్, పారామెడికల్ హెల్త్ కేర్ రంగాలలో ఉన్న ఉద్యోగ, ఉపాధి అవకాశాల పై రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ…
విజయవాడ రూరల్ మండలం అంబాపురం గ్రామంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు. ఆదివారం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
మహారాష్ట్రలో మరోసారి రిజర్వేషన్ కోసం ఆందోళనలు కొనసాగుతున్నాయి. అంబాద్ తాలూకాలోని తీర్థపురి పట్టణంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ దగ్గర మరాఠా నిరసనకారులు రాష్ట్ర రవాణా బస్సును తగులబెట్టినట్లు ఓ అధికారి వెల్లడించారు.
భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన పలు కార్యక్రమాలు సక్సెస్ అయ్యాయని నీతి అయోగ్ తెలిపింది. అది జరిపిన తాజా సర్వేలో భారత్‌లో దాదాపు 5 శాతం మేర పేదరికం తగ్గిందని నీతి అయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు.
మాల్దీవుల్లో వందలాది మంది భారత సైనికులు ఉన్నారంటూ అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ చేసిన ఆరోపణలను ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి అబ్దుల్లా షాహిద్ తోసిపుచ్చారు. తమ దేశ భూభాగంలో సాయుధులైన విదేశీ సైనికులెవరూ లేరని వెల్లడించారు.