కెనడాలో గత ఏడాది భారత దౌత్యా అధికారులకు వరుసగా బెదిరింపులు వచ్చాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ చెప్పుకొచ్చారు. అదే టైంలో ఆ దేశ వ్యవస్థల నుంచి ఎలాంటి సహకారం లభించలేదు అని పేర్కొన్నారు. అందువల్లే అక్కడ వీసా జారీ సేవలను నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఖలిస్థానీ తీవ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు భారత ఏజెంట్లే కారణమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య గత ఏడాది దౌత్యపరమైన విభేదాలు వచ్చాయి. ఫలితంగా గత సెప్టెంబర్‌లో భారత్ అక్కడ వీసా సేవలను బంద్ చేసింది. ఆ సమయంలో తలెత్తిన పరిస్థితులను వివరిస్తూ జైశంకర్ సోమవారం నాడు ఓ సమావేశంలో ఈ కామెంట్స్ చేశారు.
Read Also: Investment : పెద్ద కంపెనీలను వదిలి చిన్న ఫండ్స్ లో పెట్టుబడులు పెడుతున్న ఇన్వెస్టర్లు
ఇక, శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్, లండన్‌లోని హైకమిషన్‌పై దాడులు చేసిన వారితో పాటు కెనడాలో భారత రాయబార కార్యాలయ సిబ్బందిని బెదిరించిన దుండగులపై చర్యలు తీసుకోవాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ డిమాండ్ చేశారు. కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు ఓ దశలో మా దేశ దౌత్య కార్యాలయాలపై స్మోక్ బాంబులు కూడా విసిరారని వెల్లడించారు. వారికి అక్కడ అంత స్వేచ్ఛ ఇవ్వడంపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇతర దేశాల ప్రతినిధులను బెదిరించే స్థాయికి వాక్ స్వేచ్ఛ విస్తరించడం మంచిది కాదని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ హితవు పలికారు.
Read Also: Ayesha Khan : ఆ స్టార్ హీరో మూవీలో ఆఫర్ కొట్టేసిన అయేషా ఖాన్..
కాగా, బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియాలోనూ ఇలాంటిదాడులు జరిగాయనే విషయాన్ని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గుర్తు చేశారు. తగినంత భద్రత లభించలేదని ఆయన చెప్పారు. కానీ, ఆ తర్వాత పరిస్థితులు చక్కబడ్డాయన్నారు. ఇప్పుడు అక్కడ ఎలాంటి దాడులు జరిగినా చాలా బలమైన ప్రతిస్పందన వస్తుందని పేర్కొన్నారు. ఒక దేశ రాయబార కార్యాలయాలపై దాడులు జరిగినప్పుడు స్థానిక ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే తప్పుడు సంకేతాలను పంపిస్తుందని జై శంకర్ స్పష్టం చేశారు.