ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. మంగళవారం వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యనేతలను సమాయత్తం చేసేందుకు వైసీపీ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన తాడేపల్లి సీకే కన్వెన్షన్‌లో ఈ మీటింగ్ జరగనుంది. 175 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి నేతలు హాజరు కానున్నారు. సుమారు 2 వేలకు పైగా మండల స్థాయి నేతలు ఈ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ ఎన్నికల్లో వై నాట్ 175 లక్ష్యంగా నేతలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ఫలాలను ప్రజలకు వివరించాలని నేతలకు సూచించనున్నారు.
Crime: వడపావ్‌తో ప్రలోభపెట్టి 8 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులు
ఈ సమావేశంలో మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లకు పార్టీ ప్రతిష్టతపై గ్రౌండ్ లెవల్ లో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేయనున్నారు సీఎం జగన్. జిల్లాల్లో పార్టీ నేతల మధ్య విభేదాలు పరిష్కరించుకుని, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం జగన్ మార్గనిర్దేశం చేయనున్నారు. గత ఐదేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలే మరోసారి వైసీపీని అధికారంలోకి తీసుకువస్తాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత… వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని నేతలకు సూచించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఉదయం 9.30 గంటలకు ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఉదయం 10 గంటల సమయంలో సీఎం జగన్ రానున్నారు.
Priyanka Mohan: అభిమాని వింత కోరికను తీర్చిన ప్రియాంక మోహన్..