Crime: మహారాష్ట్రలో పుణెలోని పింప్రి చించ్‌వాడ్ ప్రాంతంలో ఓ వ్యక్తి 8 ఏళ్ల బాలుడిని వడపావ్‌తో ప్రలోభపెట్టి లైంగిక వేధింపులకు గురి చేసి హత్య చేసినట్లు పోలీసు అధికారి సోమవారం తెలిపారు. బాలుడు శనివారం తన ఇంటికి సమీపంలో తప్పిపోయాడని, సీసీటీవీ ఫుటేజీలో అతన్ని అపహరించిన వ్యక్తి 28 ఏళ్ల పవన్ పాండేగా గుర్తించామని వాకాడ్ పోలీసు స్టేషన్ అధికారి వెల్లడించారు.
Read Also: Radisson Drugs Case: రాడిసన్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ చెల్లి
“ఆదివారం పాండేను అరెస్టు చేశారు. బాలుడిని గొంతు కోసి చంపి మృతదేహాన్ని బావధాన్ ప్రాంతంలో పడవేసే ముందు తాను లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అంగీకరించాడు” అని అధికారి తెలిపారు.పాండేపై భారతీయ శిక్షాస్మృతి, లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని నిబంధనల ప్రకారం హత్య, అసహజ సెక్స్, ఇతర నేరాలకు సంబంధించిన సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేసినట్లు అధికారి పేర్కొన్నారు.