మగవారు ఎక్కువగా కండల కోసం జిమ్లో వర్కౌట్లు, జాగింగ్లు చేస్తుంటారు. అంతేకాకుండా.. శరీరానికి బలానిచ్చే ఆహారపదార్థాలు తీసుకుంటారు. అయితే ఓ యువకుడు మాత్రం బాడీ బిల్డిండ్ కోసమని నాణాలు, అయస్కాంతాలు మింగాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. శరీరానికి జింక్ అవరసరమని చిల్లర నాణాలను మింగేశాడు. అయితే.. అలా మింగిన తర్వాత వాంతులు, కడుపులో నొప్పితో సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేరాడు. దీంతో వైద్యులు స్కానింగ్ తీయగా.. అతని కడుపులో నాణాలు చూసి ఆశ్చర్యపోయారు. దీంతో ఆ యువకుడకి ఆపరేషన్ చేసి 39 నాణాలు, 37 అయస్కాంతాలను బయటకు తీశారు. ప్రస్తుతం ఆ యువకుడు కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పారు.
Read Also: PM Modi: ‘కేరళలో శత్రువులు, బయట BFF’.. రాహుల్ గాంధీ వయనాడ్ సీటుపై మోడీ..
వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పొత్తి కడుపులో నొప్పి, వాంతులతో ఓ యువకుడు ఎమర్జెన్సీ వార్డులో చేరాడు. గత 20 రోజుల నుంచి వాంతుల చేసుకున్నాడని.. దాంతో యువకుడు ఏమీ తినడంలేదని కుటుంబ సభ్యులు చెప్పారని ఆసుపత్రి సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ తరుణ్ మిట్టల్ పేర్కొన్నారు. దీంతో స్కానింగ్ చేసి చూడగా అతని కడుపులో నాణాలు కనిపించాయని.. అవి పేగుల్లోకి చేరిన నాణాలు తిన్న ఆహారం లోపలికి చేరకుండా అడ్డుకుంటున్నాయని తెలిపారు. దీంతో ఆపరేషన్ చేసి రూ.1, 2, 5 విలువైన మొత్తం 39 నాణాలు బయటకు తీసినట్లు డాక్టర్ తెలిపారు. అయితే ఆపరేషన్ చేయగానే కొద్దీగా కోలుకున్నాడని పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై యువకుడిని ప్రశ్నించగా.. ఆహారంలోని జింక్ ను శరీరం గ్రహించేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే నాణాలను మింగినట్లు చెప్పాడని డాక్టర్లు పేర్కొన్నారు. వారం రోజుల తర్వాత పూర్తిగా కోలుకోవడంతో యువకుడిని డిశ్చార్జి చేశారు, మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నాడనే అనుమానంతో సైకియాట్రిస్ట్ కు రిఫర్ చేశామని డాక్టర్లు చెప్పారు.