విజయవాడ రూరల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో యాగం చేపట్టారు. మూడు రోజుల పాటు చేపట్టనున్న అష్ఠద్రవ్య మహాగణపతి, రాజ్యలక్ష్మి, సుదర్శన లక్ష్మీనారసింహ యాగం సోమవారం ప్రారంభమైంది. గన్నవరం ప్రజలు సుఖ:సంతోషాలతో వర్ధిల్లటంతో పాటు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ.. ఈ యాగం చేపట్టినట్లు యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. ఈ కార్యక్రమం 26, 27, 28 తేదీల్లో జరుగనుంది. ఈ సందర్భంగా.. యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరి పాల్గొని వేద పండితుల ఆధ్వర్యంలో అష్ఠద్రవ్య మహాగణపతి, రాజ్యలక్ష్మి సుదర్శన లక్ష్మీనారసింహ యాగంను ప్రారంభించారు. అంతకుముందు యార్లగడ్డ వెంకట్రావు, జ్ఞానేశ్వరికి వేద పండితులు మంత్రోచ్ఛరణల నడుమ ఘన స్వాగతం పలికారు.
ఇదిలా ఉంటే.. గన్నవరం నియోజకవర్గ వ్యాప్తంగా యార్లగడ్డ వెంకట్రావు పలు అభివృద్ధి పనులను చేపడుతూ.. జనాల్లో మంచి ఆదరాభిమానాలను పెంచుకుంటున్నారు. అంతేకాకుండా.. ఆలయాల అభివృద్ధి కోసం ఎంతో కొంత సహాయం చేస్తున్నారు. అయితే.. ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని, గెలిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. కాగా.. టీడీపీ తొలి జాబితాలో గన్నవరం టికెట్ను యార్లగడ్డ వెంకట్రావు దక్కించుకున్న సంగతి తెలిసిందే.