ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రెండు పథకాలను అధికారంలోకి వచ్చిన నెల రోజుల లోపే అమలులోకి తీసుకువచ్చింది. అయితే.. మిగిలిన పథకాల్లో రెండు పథకాలను నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ లు ప్రకటించిందని, విప్లవాత్మక ఆలోచనలతో కూడిన నిర్ణయాలు కాంగ్రెస్ తీసుకుందన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు చేస్తోందా అని రాష్ట్రం వైపు దేశం చేస్తోందని, ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కూడా అమలు కానీ హామీలు ఇచ్చిందని విమర్శించిందన్నారు భట్టి విక్రమార్క. ధనిక రాష్టాన్ని అప్పుల పాలు చేసింది బీఆర్ఎస్ అని ఆయన విమర్శలు గుప్పించారు. బ్యాంకుల నుంచి అప్పు తెచ్చి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు భట్టి. గ్యారెంటీలు అమలు చేయడం కోసం కసరత్తు చేస్తున్నామని, దుబారా తగ్గించుకున్నామన్నారు.
Pawan Kalyan: ఆస్తులు అమ్మకానికి పెట్టిన పవన్.. మరి ఇంత దారుణమా.. ?
అక్కడ ఇక్కడ నిధులు జమ చేస్తుకుంటూన్నామని, సామాన్యులు, ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్త పడుతున్నామన్నారు భట్టి విక్రమార్క. ఇది చారిత్రాత్మకమైన రోజు అని, ఆరు గ్యారెంటీల అమలు దేశానికి దశ దిశ నిర్దేశం చేస్తాయన్నారు. అసాధ్యాన్ని సాధ్యం చేయడమే నేటి ఇందిరమ్మ రాజ్యమని, ఎన్ని ఇబ్బందులు ఉన్న తూచా తప్పకుండా గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడుతున్నరో అందరికీ మార్చి నెలలో జీరో బిల్ ఇస్తామని, అర్హత కలిగిన వారికి ఎలాంటి ఆంక్షలు విధించడం లేదన్నారు భట్టి విక్రమార్క. గ్రామ సభల ద్వారా అర్హులను గుర్తించాము. అర్హత ఉండి దరఖాస్తు చేసుకోలేని వారికి భవిష్యత్ లో అవకాశం కల్పిస్తామని, కాంగ్రెస్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారు.
Operation Valentine: 16 స్క్రిప్ట్‌లను కాదని వరుణ్ తేజ్ ‘ఆపరేషన్’కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రక్షణ శాఖ