పల్నాడు జిల్లా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు నిన్న వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. త్వరలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరనున్నట్లు ఆయన ప్రకటించారు. వచ్చే నెల మొదటి వారంలో నరసరావుపేటలో జరిగే రా కదలి రా సభలో లావు శ్రీకృష్ణ దేవరాయలు టీడీపీలో చేరనున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ జంగా కూడా టీడీపీలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Read Also: Rajasthan: రాజస్థాన్‌లో దారుణం.. ఐసీయూలో ఉన్న మహిళకు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం..
ఈ క్రమంలో లావు శ్రీకృష్ణదేవరాయలు ఈరోజు సాయంత్రం చంద్రబాబు నివాసానికి వెళ్లారు. పార్టీలో చేరిక, నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి పోటీ, తదితర అంశాలపై ఆయన చంద్రబాబుతో చర్చిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా.. జంగా ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై కూడా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు.. గురజాల, నరసరావుపేటలో జంగా కృష్ణమూర్తి పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వే చేస్తుంది.
Read Also: Anant Ambani pre wedding: నోరూరించే వంటకాలు.. ఎన్ని రకాలో తెలిస్తే..!
ఇదిలా ఉంటే.. జేసీ పవన్ రెడ్డి చంద్రబాబును కలిశారు. ఆయన అనంతపురం లోక్ సభ స్థానాన్ని ఆశిస్తోన్న క్రమంలో చంద్రబాబుతో భేటీ అయ్యారు. కాగా.. అనంత లోక్ సభకు పోటీ చేయాల్సిందిగా ఇప్పటికే బీకే పార్దసారధికి చంద్రబాబు సూచించారు. ఈ క్రమంలో.. చంద్రబాబు జేసీకి పవన్ రెడ్డికి ఏం చెబుతారన్నది ఆసక్తిగా మారింది.