ఇరిగేషన్, ఆర్ధిక, విద్యుత్ శాఖలపై విడుదల చేసినట్టుగానే త్వరలో ధరణి పై కూడా శ్వేత పత్రం విడుదల చేయబోతున్నామని రెవెన్యూ, హౌసింగ్, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఎంతో గొప్పగా చెప్పుతున్న ధరణి పోర్టల్ లో రైతులు, రైతు కూలీలకు ఉన్న ఐదు గుంటలు, పది గుంటలు భూమి కూడా సమస్యలోకి నెట్టబడిందన్నారు. ఆలోచన రహితంగా ధరణి ఏర్పాటు చేశారని విమర్శించారు. ప్రభుత్వ భూములను వారి సొంత…
విశాఖ ఆర్కే బీచ్‌లో పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. నిన్న ఆర్కే బీచ్‌లో ఫ్లోటింగ్ బ్రిడ్జి ప్రారంభించారు. అయితే.. అది తెగిపోయింది. కాగా.. ఫ్లోటింగ్ బ్రిడ్జి చివరి ఫ్లాట్ ఫామ్ భాగం సముద్రంలోకి 100 మీటర్లు దూరం కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు ప్రమాద సమయంలో ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మరోవైపు.. పర్యాటకులు ఫ్లోటింగ్ బ్రిడ్జి తెగిపోవడంతో ఎక్కాలంటే భయబ్రాంతులకు గురవుతున్నారు. అయితే.. ఫ్లోటింగ్ బ్రిడ్జిని నిన్న ఆర్కే బీచ్‌లో అట్టహాసంగా రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మంత్రి…
రష్యా ఆర్మీలో సహాయకులుగా రిక్రూట్ అయిన భారతీయులను ఇప్పుడు విడుదల చేస్తున్నారు. దీనిపై రష్యా అధికారులతో భారత్ మాట్లాడిందని, కాంట్రాక్టుపై నియమించుకున్న భారతీయులను విడుదల చేయాలని డిమాండ్ చేసిందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ డిమాండ్‌తో చాలా మంది భారతీయులు అక్కడి నుంచి తిరిగొచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన రా కదలిరా సభలో పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు. జగన్ పాలనలో ఐదేళ్లలో ఏం మార్పులు వచ్చాయని ప్రశ్నించారు.? ఈ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులు ఆనందంగా లేరని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో పేదలు నిరుపేదలయ్యారు.. పది రూపాయలు ఇచ్చి వంద దోచుకున్నాడని మండిపడ్డారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో ముప్పై ఏండ్లు వెనక్కి పోయిందని ఆరోపించారు. జగన్.. పేదలమనషి అంటూ కొత్తనాటకం…
పశ్చిమ సరిహద్దులో సీమాంతర ఉగ్రవాదంపై భారతదేశం చాలా కాలంగా ఎదుర్కొంటున్న సవాలుకు ఇప్పుడు మరింత సరైన స్పందన లభిస్తోందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సోమవారం అన్నారు.
అనంతపురం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో 'న్యాయ సాధన' సభ పేరుతో బహిరంగ సభను నిర్వహించింది. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. అనంతపురం జిల్లా అంటే సోనియాగాంధీ, రాహుల్ గాంధీకి అమిత ప్రేమ అని అన్నారు. మరోవైపు.. రాష్ట్ర అభివృద్ధి వైఎస్సార్ హాయంలోనే జరిగినట్లు చెప్పారు. అలాంటి.. సుపరిపాలన అందించేందుకు వైఎస్ షర్మిలను మీ ముందుకు తీసుకొచ్చామని ఖర్గే పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడుతుందని, తప్పకుండా…
స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలన్న ఏపీ ప్రభుత్వ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మరోసారి వాయిదా పడింది. చంద్రబాబు బెయిల్ రద్దు కేసు విచారణ మూడు వారాలకు వాయిదా వేసింది భారత అత్యున్నత న్యాయస్థానం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
మహిళా కోస్ట్‌గార్డ్ అధికారులకు పర్మినెంట్ కమిషన్ మంజూరు చేసే అంశంపై కేంద్రానికి అల్టిమేటం ఇస్తూ.. ‘మహిళలను వదిలిపెట్టలేం అని, మీరు చేయకుంటే మేం చేస్తాం’ అని సుప్రీం కోర్టు ఈరోజు పేర్కొంది.
పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి టీడీపీలో చేరారు. విజయవాడలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీకి రాజీనామా చేసిన పార్థసారథి.. గతంలోనే టీడీపీ చేరతానని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటి జాబితాలో తనకు టిక్కెట్ ఇవ్వడం ఆనందంగా ఉందని పార్థసారథి అన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారం నూజివీడు వెళ్తున్నానని తెలిపారు. మరోవైపు.. కోటి 30 లక్షల మందితో సర్వే చేసి టిక్కెట్లు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.…
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాలంటే.. రాహుల్ ప్రధాని కావాలి.. రాహుల్ గాంధీని ప్రధాని చేస్తే.. పెట్రో..డీజిల్ ధరలు తగ్గుతాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. భారత్ జోడోలో కన్యాకుమారి నుండి కశ్మీర్ వరకు ప్రజల కష్టాలు నేరుగా తెలుసుకున్నారని తెలిపారు. ఇప్పుడు న్యాయ యాత్ర పేరుతో యాత్ర కొనసాగుతుందన్నారు. బీజేపీ ఎప్పుడూ మతాన్ని రెచ్చగొట్టడమే చేస్తుందని మండిపడ్డారు. రాహుల్ గాంధీ ఎప్పుడూ మతాన్ని రాజకీయం చేయరని అన్నారు. బీజేపీ పుట్టిన తర్వాతనే దేవుళ్ళును మొక్కుతున్నట్టు క్రియేట్…