మేదరమెట్లలో వైసీపీ నిర్వహించిన ‘సిద్ధం’ సభలో సీఎం జగన్ పాల్గొని ప్రసంగించారు. మేదరమెట్లలో ఉప్పెనలా వచ్చిన జనసమూహం కనిపిస్తోంది.. సభకు వచ్చిన ప్రజల్ని చూస్తుంటే మహాసముద్రాన్ని తలపిస్తోందని అన్నారు. నాపై నమ్మకంతో వచ్చిన అందరికీ ధన్యవాదాలు.. మరో ఐదేళ్లు ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దామని తెలిపారు. పేదవాడి భవిష్యత్ ను కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా అని అన్నారు. పార్టీల పొత్తులతో చంద్రబాబు.. ప్రజలే బలంగా మనం తలబడుతున్నామని చెప్పారు. పేదలను గెలిపించడమే తన లక్ష్యమన్నారు. జగన్ ను ఓడించాలని వాళ్లు చూస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికలు ధర్మం.. అధర్మం మధ్య జరిగే యుద్ధం అని సీఎం జగన్ తెలిపారు.
Trigun: ఆ సినిమాలో అన్నీ బూతులే.. కానీ, డబ్బులు బాగా వచ్చాయి
సిద్ధం అంటే ఓ ప్రజా సముద్రం.. ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా సిద్ధం అని సీఎం జగన్ అన్నారు. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధం అని తెలిపారు. ఓటు అనే అస్త్రాన్ని ప్రయోగించాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నారు. నాకు నటించే పొలిటికల్ స్టార్స్ లేరు.. నాకు రకరకాల పార్టీలతో పొత్తులు లేవు.. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నానని తెలిపారు. సామాన్య ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లని పేర్కొన్నారు. మరో 4 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. మరోవైపు.. టీడీపీ, జనసేన పార్టీలకు సేనాధిపతులే ఉన్నారు తప్ప.. సైన్యం లేదని ఆరోపించారు. నోటాకు వచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీ.. అటువైపు ఉందని విమర్శించారు. వాళ్ల వెనుక ప్రజలు లేరు కాబట్టి.. పొత్తులు, ఎత్తులతో వస్తున్నారని వ్యాఖ్యానించారు.
BJP: అభ్యర్థుల ఖరారుపై బీజేపీ తుది కసరత్తు.. ఏపీకి కేంద్ర మంత్రి
సైకిల్ చక్రం తిరగడం లేదని దత్తపుత్రుడితో కలిసి ఢిల్లీలో మోకరిల్లారు చంద్రబాబు అని సీఎం జగన్ దుయ్యబట్టారు. చంద్రబాబు గుండెల్లో జగన్ రైళ్లు పరిగెత్తించకపోయి ఉంటే.. ఇన్ని పొత్తుల కోసం ఎందుకు అగచాట్లు ఎందకని ప్రశ్నించారు. మన నేతలంతా గడపగడపకు వెళ్లి చేసిన సంక్షేమం, అభివృద్ధిని చెబుతున్నారని తెలిపారు. ప్రజలు ఆశీర్వదించడంతోనే.. మన ఫ్యాన్ కు పవర్ వస్తోందని సీఎం జగన్ అన్నారు. మాట తప్పకుండా మేనిఫెస్టోను అమలు చేసినందుకే మన ఫ్యాన్ కు కరెంట్ వస్తోందని తెలిపారు. చంద్రబాబు సైకిల్ కు చక్రాలే లేవు.. తుప్పు పట్టిన బాబు సైకిల్ తొక్కడానికి ఆయనకు ఇతరులు కావాలని విమర్శించారు. ప్యాకేజీ ఇచ్చి ఒక దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు చంద్రబాబు.. ప్యాకేజీ స్టార్ అయితే సైకిల్ సీట్ అడగడు.. ఎందుకు తక్కువ సీట్లు ఇస్తున్నావని అడగడు..ప్యాకేజీ స్టార్ సైకిల్ దిగమంటే దిగతాడు.. సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్ అని సీఎం జగన్ విమర్శించారు.