ఖమ్మం పత్తి మార్కెట్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మార్కెట్ యార్డ్ షెడ్లో పత్తి బస్తాలు తగలబడుతున్నాయి. దీంతో మంటలు భారీగా ఎగసిపడుతున్నాయి. మరోవైపు.. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫిబ్రవరిలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆయన పర్యటన ఖరారుపై ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ తో రాష్ట్ర మంత్రులు, ఇతర నేతలు చర్చించారు. ఢిల్లీలోని కేసి వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై చర్చించారు.
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని మాసబ్ ట్యాంక్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో.. రేపు కరీంనగర్ కోర్టుకు వెళ్ళాలని.. 17న విచారణకు హాజరవుతాన్న కౌశిక్ రెడ్డి పోలీసులకు సమాధానం ఇచ్చారు.
ఢిల్లీలోని కేసి వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సంస్థాగత అంశాలతో పాటు, శాఖల వారీగా పనితీరుపై సమీక్ష చేపట్టారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు మంత్రులతో సమీక్ష చేయనున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై చర్చించనున్నారు.
‘కాళేశ్వరం – మంథని – రామగిరి’ని ఆధ్యాత్మిక, వారసత్వ పర్యాటక సర్య్కూట్‌గా గుర్తించి.. అభివృద్ధి చేయాలని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ఆయనను కలిసి మంథని నియోజకవర్గ పరిధిలోని కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం, రామగిరి కోటను టూరిజం హబ్ గా అభివృద్ధి చేసేందుకు చొరవ చూపాలని వినతి పత్రం అందజేశారు.
రేపు ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. నంది నగర్ నివాసం నుంచి 10 గంటలకు బయలుదేరనున్నారు కేటీఆర్. ఫార్ములా-ఈ కార్ కేసులో భాగంగా ఈడీ అధికారులు కేటీఆర్‌ను విచారించనున్నారు.
ఇటీవల ముగిసిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ స్కాట్ బోలాండ్ ముఖ్యమైన పాత్ర పోషించాడని భారత జట్టు మాజీ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పేర్కొన్నాడు. బోలాండ్‌ను జట్టులో ఎంపిక చేయకపోయి ఉంటే.. భారత జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుని ఉండేదని అశ్విన్ అభిప్రాయపడ్డాడు.
తెలంగాణలో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్ 29 నుండి మే 5 వరకు ఎప్ సెట్ (ఈఏపీసెట్).. ఏప్రిల్ 29, 30న అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్ష.. మే 2 నుంచి 5 వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించనున్నారు.
మరో కొత్త స్కూటర్ లాంచ్.. ఫుల్ ఛార్జింగ్‌తో 70-80 కి.మీ దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. కొత్త కొత్త సంస్థలతో పాటు ప్రముఖ కంపెనీలు కూడా ఈ సెగ్మెంట్‌పై ఫోకస్ చేయడంతో కస్టమర్స్‌కు మంచి ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో.. మాగ్నస్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆంపియర్ 2025 జనవరిలో విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో ఏ కెపాసిటీ బ్యాటరీ అందించారు.. ఎలాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి..? ఏ ధరకు కొనుగోలు చేయవచ్చు..?…
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో గ్రామస్థులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి పండుగ కళ వచ్చింది.. పండక్కి అందరూ సొంత ఊళ్లకు వెళుతున్నారు. ఇది వరకు ఇలా వెళ్లే వారు కాదని అన్నారు. మరోవైపు.. విజన్ 2047ను ప్రవేశపెట్టాను.. ప్రతి ఇంటికి హెల్త్, వెల్త్, హ్యాపీ అందించాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు.