Gottipati Ravikumar: వైసీపీ విష ప్రచారాన్ని నమ్మొద్దు.. వారికి ఉచిత విద్యుత్ పథకం..!
- ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు అంటూ..,
- వైసీపీ చేసే విషప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మొద్దు- గొట్టిపాటి రవికుమార్
- విద్యుత్ వ్యవస్థపై కక్షపెట్టుకున్నందుకే రోజూ అసత్యాల బురద చల్లుతున్నాడు
- విద్యుత్ వ్యవస్థను చంద్రబాబు అనతికాలంలోనే సరిదిద్దారు- గొట్టిపాటి రవికుమార్
- ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తుండటాన్ని చూసి జగన్ తట్టుకోలేకపోతున్నాడు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు అంటూ వైసీపీ చేసే విషప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మొద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ వ్యవస్థపై జగన్మోహన్ రెడ్డి కక్ష పెట్టుకున్నందుకే రోజూ అసత్యాల బురద చల్లుతున్నాడని ఆరోపించారు. ఐదేళ్లు విధ్వంసం చేసిన విద్యుత్ వ్యవస్థను చంద్రబాబు అనతికాలంలోనే తన అనుభవంతో సరిదిద్దారని అన్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందిస్తుండటాన్ని చూసి జగన్ తట్టుకోలేకపోతున్నాడని మండిపడ్డారు. సూర్యఘర్, పీఎం కుసుమ్ పథకాల ప్రయోజనంపై అవగాహన లేక జగన్ అసత్యాలు ప్రచారం ప్రారంభించాడని విమర్శించారు. దీర్ఘకాలంలో పథకాల ప్రయోజనాలను ప్రజలు తెలుసుకుంటారని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు.
Read Also: Donald Trump: అమెరికా అధ్యక్షుడైన తొలి రోజు 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై ట్రంప్ సంతకం..
Also Read
- Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు..
- Nadendla Manohar: జనసేన టికెట్లపై క్లారిటీ..! గ్రూపులు లేవు.. పవన్ కల్యాణ్ నిర్ణయమే ఫైనల్..
- Amaravati: రాజధానికి మాస్ ట్రాన్స్‌పోర్టేషన్ ప్రణాళిక.. సీఆర్డీఏ కీలక నిర్ణయం
- CM Chandrababu: ఇక ఇంటిపై పూర్తి హక్కు.. విశాఖలో 28,445 కుటుంబాల కల సాకారం
ఎలాంటి అదనపు భారం లేకుండా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించే పీఎంకుసుమ్, సూర్యఘర్ పథకాల వల్ల నష్టమేంటో జగన్ చెప్పాలి..? అని మంత్రి ప్రశ్నించారు. కేంద్ర-రాష్ట్ర ప్రాయోజిక పథకాలైన సూర్యఘర్, పీఎం కుసుమ్ వల్ల విద్యుత్ వినియోగదారులకు మరింత లబ్ధి చేకూరుతుందని అన్నారు. పీఎం కుసుమ్ పథకం ద్వారా రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ మరింత మెరుగ్గా అందించవచ్చని పేర్కొన్నారు. రైతులకు ఫీడర్ లెవల్‌లోనే నాణ్యమైన విద్యుత్‌ను జగన్ వద్దంటాడా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యఘర్ ద్వారా నాణ్యమైన విద్యుత్ గృహ వినియోగదారులకు అందుతుందని తెలిపారు మంత్రి గొట్టిపాటి రవికుమార్.
Read Also: Liver Disease : మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. మీ లివర్ పని అయిపోయినట్లే?
జగన్ నిర్లక్ష్యం చేసిన వీటిని మేం అందిపుచ్చకోవటాన్ని చూసి ఓర్వలేకపోతున్నాడని మంత్రి పేర్కొన్నారు. కుప్పంలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న సూర్యఘర్ పథకం రాష్ట్రమంతటా అమల్లోకి తెస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలకు సౌర ఫలకాల ఏర్పాటు ఉచితంగా పెడుతున్నామన్నారు. దేశంలో విప్లవాత్మక మార్పులు అందిపుచ్చుకోవటంలో చంద్రబాబు ఎప్పుడూ ముందు ఉంటారని మంత్రి తెలిపారు. ఏ మంచి పథకంపైనైనా విషం చిమ్మి వ్యవస్థను నాశనం చేసేందుకూ జగన్ ముందు ఉంటాడని దుయ్యబట్టారు. ఇద్దరి పాలన మధ్య తేడా ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. తన ఐదేళ్ల పాలనలో జగన్ గర్వంగా చెప్పుకునే పథకం ఒక్కటైనా ఉందా..? అని ప్రశ్నించారు. ప్రజలు ఒక్క అవకాశం అని నమ్మినందుకు రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టాడని మంత్రి ఆరోపించారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!