ఇజ్రాయెల్- హమాస్ మధ్య కొనసాగుతున్న ఖైదీల విడుదల..
కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన తర్వాత ఇజ్రాయెల్- హమాస్‌లు తమ అధీనంలో ఉన్న బందీలను దశల వారిగా విడుదల చేస్తున్నారు. తమ చెరలోని బందీలుగా ముగ్గురిని హమాస్ రిలీజ్ చేయగా.. ఇజ్రాయెల్ కూడా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడిచి పెట్టింది. ఈ రెండు దేశాల మధ్య కుదిరిన ఒప్పందంతో 15 నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా స్వస్తి పలికినట్లైంది.
65వ నెంబర్ జాతీయ రహదారిని ఆరు లైన్‌లుగా విస్తరించాలనేది నా కల
నల్లగొండ జిల్లాలో నేడు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా 65వ నెంబర్ జాతీయ రహదారిపై వాహనాల రద్దీని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలవుతాయన్నారు. 65 వ నెంబర్ జాతీయ రహదారిని ఆరు లైన్ లుగా విస్తరించాలనేది నాకల అని ఆయన వ్యాఖ్యానించారు. విస్తరణ తర్వాత యాక్సిడెంట్ ఫ్రీ జాతీయ రహదారి అందుబాటులోకి వస్తుందని, మే నెలలో జాతీయ రహదారి విస్తరణ పనులు మొదలై రెండు సంవత్సరాలలో పూర్తవుతాయన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వాహనాల రద్దీ విషయంలో GMR ప్రభుత్వానికి తప్పుడు లెక్కలు చెప్పిందన్నారు మంత్రి కోమటి రెడ్డి. GMR నేషనల్ హైవే అథారిటీతో చేసుకున్న అగ్రిమెంట్ ను ఉల్లంఘించిందన్నారు. నా పోరాటం వల్లే 65 వ నంబర్ జాతీయ రహదారి విస్తరణ జరగబోతుందని, జాతీయ రహదారి విస్తరణ తర్వాత నల్లగొండ జిల్లాలో డ్రై పోర్ట్ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు.
వెండితెరపై అలరించబోతోన్న యాంకర్ సుమ..
స్టార్ యాంకర్ సుమ కనకాల .. ఈ పేరుకు బుల్లితెరపై ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు. తన కామెడీ పంచ్‌లతో ప్రత్యేకమైన ఇమేజ్‌ని సంపాదించుకుంది.ఎంతో మంది యాంకర్స్ వస్తున్నారు, పోతున్నారు.. కానీ సుమ మాత్రం దశాబ్దాలుగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటుంది. ఇక పెద్ద సినిమా పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయిన, మూవీ ప్రమోషన్స్ కార్యక్రమలైన హోస్ట్‌గా సుమ ఉండాల్సిందే. అంతేకాదు హీరోలు, హీరోయిన్ లు కూడా సుమ మాటలను బాగా ఇష్టపడతారు.
డిప్యూటీ సీఎం అనే పదానికి పవన్ కళ్యాణ్ వన్నె తెచ్చారు!
డిప్యూటీ సీఎం అనే పదానికి జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ వన్నెతెచ్చారు గానీ.. పవన్ గారికి డిప్యూటీ సీఎం పదవి వల్ల ప్రత్యేక చరిష్మా రాలేదని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల అంటున్నారు. గత సంవత్సరాల అనుభవంలో డిప్యూటీ సీఎంలుగా ఎవరున్నారో తనతో పాటు చాలామందికి తెలియని పరిస్థితి అని, ఈ రోజున దేశం మొత్తం ఏపీ డిప్యూటీ సీఎం గురించి చర్చిస్తున్నారన్నారు. ఇంతితై వటుడింతై వామన రూపంలో మహావిష్ణువు ఎదిగినట్టు.. పవన్ కళ్యాణ్ గారు మరింత ఎదుగుతున్నారని కిషోర్ గునుకుల పేర్కొన్నారు.
అమెరికాలో రవితేజపై కాల్పులు.. ఎన్టీవీతో మృతుడి తండ్రి కన్నీటి పర్యంతం..
అమెరికాలో ఉన్న ఒక యువకుడు పై దుండగులు కాల్పులు జరపగా, యువకుడు అక్కడే మృతి చెందాడు. ఈ యువకుడు, రవితేజ అనే పేరు గల హైద్రాబాద్ పట్నం చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధి లోని ఆర్కేపురం డివిజన్, గ్రీన్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ 2 ప్రాంతం లో నివసించేవాడు. 2022 మార్చిలో, రవితేజ అమెరికా వెళ్లి అక్కడ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం, ఉద్యోగం కోసం వెతుకుతూ ఉన్నాడు. ఇటీవల, వాషింగ్టన్ ఏవ్ లో దుండగులు జరిపిన కాల్పుల్లో రవితేజ ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు సంక్షేమం కోసమే పెట్రోల్ బంకులు ఏర్పాటు: ఏపీ డీజీపీ
పోలీసులు సంక్షేమం కోసమే పెట్రోల్ బంకులు ఏర్పాటు చేస్తున్నామని ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు అన్నారు. నాన్ పోలీసుల సంక్షేమానికి కూడా తోడ్పాటుగా ఉంటుందన్నారు. పోలీస్ పెట్రోల్ బంక్‌లో ఖచ్చితమైన నాణ్యత ప్రమాణాలు ఉంటాయని, ప్రజలు ఈ బంకుల్లో పెట్రోల్ కొట్టించుకొని పోలీస్ శాఖకు సహకరించాలని డీజీపీ కోరారు. ఈరోజు రాజమహేంద్రవరంలో పెట్రోల్ బంక్‌ను ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు. లాలా చెరువు సమీపంలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఏర్పాటు అయింది.
కొమురవెల్లి మల్లన్న జాతరలో మహిళా యూట్యూబర్ హల్ చల్
సిద్దిపేట జిల్లాలోని చేర్యాల మండలం కొమురవెల్లి గ్రామంలో జరుగుతున్న మల్లన్న స్వామి జాతర సందడిగా కొనసాగుతోంది. ఈ పవిత్ర జాతరలో భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు హాజరయ్యే ఈ జాతర విశేషాలకు సంబంధించిన వీడియోలను చిత్రీకరించేందుకు, యూట్యూబర్ గ్యాంగ్ జాతర ప్రాంతానికి వచ్చింది. జాతరలో జనసందోహం మధ్య వీడియోలు చిత్రీకరిస్తుండగా, కొన్ని సార్లు భక్తులు అసౌకర్యాన్ని ఎదుర్కొన్నట్లు భావించి, కొందరు వారిని ఆపేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంలో యూట్యూబర్ గ్యాంగ్‌కు , భక్తులకు మధ్య మాటల వాగ్వాదం చోటు చేసుకుంది. మాటల వాగ్వాదం తీవ్రస్థాయికి చేరి పరిస్థితి ఉద్రిక్తతగా మారింది.
సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్.. పరువు నష్టం కేసులో విచారణ నిలిపివేత !
సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ దొరికింది. లోక్ సభ ఎన్నికలకు ముందు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీపై చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్ పై దాఖలైన పరువు నష్టం కేసులో ఆయనపై నమోదైన క్రిమినల్ విచారణను సుప్రీంకోర్టు నిలిపివేస్తున్నట్లు ఈరోజు (జనవరి 20) ప్రకటించింది. ఇక, రాహుల్ గాంధీపై భారతీయ జనతా పార్టీ కార్యకర్త నవీన్ ఝా దాఖలు చేసిన పరువు నష్టం కేసును కొట్టివేసింది.
కేటీఆర్‌కు షాక్.. రైతు ధర్నాకు అనుమతి నిరాకరణ
రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన రైతు మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ ధర్నాకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ధర్నా ప్రతిపాదిత స్థలం హైవే వెంట ఉండటం, జిల్లాలో గ్రామసభలు జరుగుతుండడం, సంక్రాంతి హడావిడి నెలకొన్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఇవ్వలేమని బీఆర్ఎస్ పార్టీకి తేల్చి చెప్పారు పోలీసులు. రేపటి మహా ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో.. బీఆర్ఎస్ పార్టీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసేదూకు సిద్ధమవుతుంది.. కేటీఆర్ పాల్గొనే రైతు ధర్నాకు అనుమతి ఇవ్వకపోవడాన్ని బీఆర్ఎస్ పార్టీ తప్పు పట్టింది.
ప్రముఖ టాలీవుడ్ విలన్ మృతి!
ప్రముఖ టాలీవుడ్ విలన్ విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్ మృతి చెందారు. సోమవారం ఉదయం చెన్నైలో ఓ ప్రవేట్ హాస్పిటల్‌లో గుండెపోటుతో మరణించారు. వారం క్రితం హైదరాబాద్‌లో ఒక సినిమా షూటింగ్‌లో గాయపడ్డ విజయ రంగ రాజు.. ట్రీట్‌మెంట్ కోసం చెన్నై వెళ్లి అక్కడే కన్నుమూశారు. విజయ రంగరాజుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. టాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
విజయ రంగరాజుకు బాపు దర్శకత్వంలో వచ్చిన ‘సీతా కళ్యాణం’ మొదటి సినిమా. 1994లో వచ్చిన ‘భైరవ ద్వీపం’ చిత్రంతో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది. అనంతరం ఎక్కువగా విలన్, సహాయ పాత్రలు పోషించి.. టాలీవుడ్లో మంచి గుర్తింపు పొందారు. ‘యజ్ఞం’ సినిమాతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. గోపీచంద్ హీరోగా నటించిన యజ్ఞం చిత్రంలో విజయ రంగరాజు విలన్ పాత్రలో అదరగొట్టారు. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో కూడా ఆయన నటించారు. వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్‌లో కూడా రంగరాజుకు పట్టు ఉంది.
దావోస్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంలు.. రాష్ట్రాలకు పెట్టుబడులే లక్ష్యంగా..
ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సదస్సు సోమవారం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రారంభం కానుంది. ఈ సదస్సు ఈ నెల 24 వరకు కొనసాగనుంది. ప్రపంచంలోని శక్తివంతమైన నేతలు, వివిధ రంగాల ప్రముఖులు సుమారు 2,500 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ సందర్భంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా దావోస్ చేరుకున్నారు. విజయవాడ నుండి బయలుదేరిన చంద్రబాబు ముందుగా ఢిల్లీ చేరుకుని, అక్కడ నుంచి అర్ధరాత్రి జ్యూరిచ్ చేరుకుని, సోమవారం ఉదయం పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. అనంతరం రోడ్డు మార్గంలో దావోస్ చేరుకున్నారు.
ఇదిలా ఉంటే.. సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ నుంచి దావోస్ కు బయలుదేరి వెళ్లారు. ఈ సమయంలో, రెండు తెలుగు రాష్ట్రాలు పెట్టుబడులు ఆకర్షించేందుకు తమ ప్రత్యేకమైన ప్లాన్‌లను సిద్ధం చేసుకున్నారు. చంద్రబాబు “బ్రాండ్ ఏపీ”తో, రేవంత్ రెడ్డి “రైజింగ్ తెలంగాణ”తో దావోస్ వెళ్లారు. అయితే.. రెండు తెలుగు రాష్ట్రాల బృందాలు దావోస్ కలిసిన ఫోటో ఆసక్తికరంగా మారింది. ఇందులో ఏపీ బృందం తరుఫున సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు లు ఉండగా.. తెలంగాణ బృందం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబులు ఉన్నారు.