విజయవాడ కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక దినోత్సవంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకం టెంట్ దగ్గర కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు మాత్రమే కుర్చీలు వేశారు అధికారులు.
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకానికి తూట్లు అంటూ వైసీపీ చేసే విషప్రచారాన్ని ప్రజలెవ్వరూ నమ్మొద్దని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. విద్యుత్ వ్యవస్థపై జగన్మోహన్ రెడ్డి కక్ష పెట్టుకున్నందుకే రోజూ అసత్యాల బురద చల్లుతున్నాడని ఆరోపించారు.
హైదరాబాద్లో అఫ్జల్గంజ్ కాల్పుల దుండగులు.. అఫ్జల్గంజ్ కాల్పులు జరిపిన దుండగులు హైదరాబాద్లోనే ఉన్నారని పోలీసులు తెలిపారు. ఆ ముఠా ఇంకా రాష్ట్రం దాటలేదన్నారు. పూటకో డ్రెస్ తో హైదరాబాద్ గల్లీల్లోనే తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు. ఆటోల్లో ప్రయాణిస్తూ.. పోలిసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు.. హైదరాబాద్ లోని ప్రతి ఏరియా తెలిసి ఉండటం వల్లే.. అంత ఈజీగా తిరుగుతున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దుండగులకు ఎవరో ఒకరు హైదరాబాద్ కి చెందిన వాళ్ళే షెల్టర్ ఇచ్చి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.…
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏమి కోరితే అది మంజూరు చేసేందుకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం సిద్ధంగా ఉందని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీలో అభివృద్ది పరుగులు పెడుతోందని అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలోని ప్రసిద్ధ లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం ప్రాంగణంలో అపచారం చోటు చేసుకుంది. దేవస్థానం కార్యాలయంలో తాగిన మద్యం బాటిల్స్, తిని పాడేసిన బిర్యానీ ప్యాకెట్లు బయటపడ్డాయి. ఆలయ సిబ్బంది నిర్వాహకంగా అనుమానిస్తున్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో ఆయనకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు.. గతంలో అమిత్ షా తిరుపతి పర్యటన సమయంలో చంద్రబాబు బ్యాచ్ రాళ్ల వర్షం కురిపించారని అన్నారు. నచ్చితే కాళ్ళు.. నచ్చకుంటే జుట్టు పట్టుకునే టైప్ రాజకీయ నేత చంద్రబాబని దుయ్యబట్టారు.
స్వచ్ఛ్ ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేయాలి అని నిర్ణయించాం.. అందుకే.. అక్టోబర్ 2న ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశం మొత్తం ఒక స్ఫూర్తితో అడుగులు ముందుకు వేయాలని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. మున్సిపాలిటీలలో స్వచ్ఛతగా ముందుకు వెళ్లలేకపోయామని వెల్లడించారు. కడపలో మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. “ఇతర దేశాలలో రోడ్లపై చెత్త వేయరు.. ఇంటికెళ్లి డస్ట్ బిన్ లో వేస్తారు.. గతంలో నేను ఏ ఊరికి…
ఓయో రూంలో గంజాయి దుకాణం పెట్టిన కేటుగాళ్లు హైదరాబాద్ కొండాపూర్ లోని ఓయో రూమ్ లో గంజాయి వ్యాపారం నిర్వహిస్తున్న ఇద్దరిని ఎక్సైజ్ స్టేట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిని కావలికు చెందిన రాజు, మధ్యప్రదేశ్ కు చెందిన సంజనగా గుర్తించారు పొలిసు అధికారులు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వీరు గత కొంతకాలంగా ఆరుకు ప్రాంతాల నుండి గంజాయి తీసుకువచ్చి, ఓయో రూమ్ లో ఉంటూ విక్రయాలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో…
ఏపీకి ముందు ముందు మంచి కాలం ఉంది ఆంధ్రప్రదేశ్కు ముందు ముందు మంచి కాలం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ స్టీల్ ఫ్లాంట్కు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది. ఈ సందర్భంగా చంద్రబాబు .. కేంద్రానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అని పేర్కొన్నారు. ఇది కేవలం ఎన్నికల హామీ కాదని.. రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పడానికి ఇదొక నిదర్శనం అని చెప్పుకొచ్చారు. విశాఖ ఉక్కుపై కేంద్రం గుడ్న్యూ్స్ చెప్పింది.…