పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు 14 ఏళ్లు.. బుష్రా బీబీకి 7 ఏళ్ల జైలు శిక్ష 190 మిలియన్ ఫౌండ్ అల్-ఖాదిర్ ట్రస్ట్ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. ఆయన భార్య బుష్రా బీబీకి కూడా 7 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. దీనితో పాటు భారీ జరిమానా కూడా విధించబడింది. కోర్టు తన నిర్ణయంతో పాటు, ఇమ్రాన్ భార్య బుష్రా బీబీని…
14 రోజుల తర్వాత ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష విరమణ బీపీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా 15 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న జన్ సూరాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ గురువారం విరమించారు. జనవరి 2 నుంచి ఈ దీక్ష చేస్తున్నారు. బీహార్‌లోని మెరైన్ డ్రైవ్‌లోని సత్యాగ్రహ స్థలంలో నిరాహార దీక్షను విరమించారు. బీపీఎస్సీ పరీక్షల్లో జరిగిన అవకతవలను నిరసిస్తూ అభ్యర్థులకు మద్దతుగా నిరాహార దీక్షకు కూర్చున్నారు. ఎట్టకేలకు 14 రోజుల తర్వాత నిరాహార దీక్ష విరమించి..…
సంక్రాంతి పండగకు ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడిపించింది. జనవరి 8 నుంచి 13 వరకు 3400 సర్వీసులు, జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు 3800 సర్వీసులు నడిపించింది ఏపీఎస్ఆర్టీసీ.
ఖమ్మం మార్కెట్‌ను ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చి దిద్దుతా! ఖమ్మం పత్తి మార్కెట్లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 400 పత్తి బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. సంక్రాంతికి ముందు కొందరు వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తి అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. ఈ ఘటనపై రాత్రే స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.. నేడు ఖమ్మం మార్కెట్‌ను పరిలిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాత్రి పత్తి కాలిపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఖమ్మం…
ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐటీ అనుభవంతో ప్రజలకు సంపదను సృష్టిస్తా అని చెప్పా.. అభివృద్ధి వల్ల సంపద వస్తుందని సీఎ చంద్రబాబు అన్నారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఇంజనీర్ కాలేజ్ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. ఇంజనీరింగ్ విద్యార్థిని పై అత్యాచారానికి పాల్పడ్డాడు డ్రైవర్.. హాస్టల్లో దూరి బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై అత్యాచారానికి యత్నించాడు. కాలేజీ యజమాని డ్రైవరే ఈ ఘటనకు పాల్పడ్డాడు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ప్రక్కదారి పట్టించడానికే అరెస్టులని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. గట్టిగా ఆరు గ్యారంటీలు అడిగుతే తమపై కేసులు పెడుతున్నారు.. కేటీఆర్ ఇచ్చిన పథకాలను అడిగితే తమపై కేసులు పెడుతున్నారని కౌశిక్ రెడ్డి తెలిపారు.
ఢిల్లీ ఎన్నికల కోసం మరో రెండు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రకటించింది. ప్రతీ నెల 3 యూనిట్ల ఫ్రీ కరెంట్, రూ. 500కే ఉచిత సిలిండర్ గ్యారంటీలను ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తరపున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్, కాంగ్రెస్ నేతలు విడుదల చేశారు.
తెలంగాణకు అంతరాష్ట్ర నదీ జలాల వివాద చట్టం (ఐఎస్ఆర్డబ్ల్యూడీఏ)-1956 సెక్షన్ 3 ప్రకారం నీటి కేటాయింపులు చేపట్టాలనే విషయంపై కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-II (కేడబ్ల్యూడీటీ-II) ఎదుట బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.