ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. వచ్చే నెల (ఫిబ్రవరి 6) న ఈ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో వచ్చే బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. త్వరలో ప్రారంభించే సంక్షేమ పథకాలపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది. అంతేకాకుండా.. వాట్సాప్ గవర్నెన్స్ విధి విధానాలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ఈ కేబినెట్ భేటీలో ఇతర కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రస్తుతం దావోస్‌లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బృందం పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశం అవుతున్నారు. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, పెట్టుబడులకు ఉన్న అనుకూల పరిస్థితులను వివరిస్తూ.. పెట్టుబడులతో రండి అని ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి.