హైదరాబాద్‌లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్ అయింది. సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజానిర్దారణ కమిటీ వేసింది. దీంతో.. కమిటీ గాంధీ ఆసుపత్రికి రానుంది. కిడ్నీ రాకెట్ ప్రధాన సూత్రదారులపై నిజానిజాలు తెలుసుకునేందుకు కమిటీని నియమించింది ప్రభుత్వం. ఉస్మానియా మాజీ సూపరిండెంట్ నాగేందర్ నేతృత్వంలో నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్‌లతో కలిపి హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనర్సింహ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో.. అలకనంద హాస్పిటల్‌ని కమిటీ పరిశీలించింది. హాస్పిటల్స్ సీజ్‌లో ఉండటంతో కమిటీ సభ్యులు గాంధీ హాస్పిటల్‌కు వెళ్లారు.
Read Also: TG High Court: తెలంగాణ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు..
మరోవైపు.. కిడ్నీ రాకెట్ వ్యవహారంపై రంగారెడ్డి జిల్లా డీఎం అండ్ హెచ్‌వో మాట్లాడుతూ.. అలకనంద సూపర్ స్పెషాలిటీ హాస్పటల్‌కి కేవలం ఆరు నెలల క్రితం 9 బెడ్స్‌కి అనుమతులు ఇచ్చామని తెలిపారు. కానీ ఈ ఆసుపత్రిలో దారుణంగా, ఇష్టారాజ్యంగా ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీలు చేస్తున్నారని అన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం ఆస్పత్రి యాజమాన్యంపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఇప్పటికే అలకనంద ఆస్పత్రిని సీజ్ చేసాం.. శాశ్వతంగా ఈ ఆస్పత్రిని మూసి వేసే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు. ప్రభుత్వం, ఆరోగ్య శాఖ మంత్రి ఈ అంశం పై చాలా సీరియస్‌గా ఉన్నారని డీఎం అండ్ హెచ్‌వో తెలిపారు.
Read Also: Auto Expo 2025: యాక్టివాకు పోటీగా హీరో కొత్త స్కూటర్!.. వారికి బెటర్ ఆప్షన్..
ఎంతటివారైనా వైద్యులపై చర్యలు తప్పవు.. ఇప్పటికే మెడికల్ కౌన్సిల్‌కి ఫిర్యాదు అందజేసామని డీఎం అండ్ హెచ్‌వో తెలిపారు. డాక్టర్స్ లైసెన్స్ రద్దు చేయాల్సిన అవసరం ఉంది.. ఆ దిశగా చర్యలు కౌన్సిల్ తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇద్దరు తమిళనాడు నుంచి ఇద్దరు కర్ణాటక నుంచి రావడంతో భాష సమస్య వచ్చింది.. కిడ్నీ మార్పిడి జరిగిన విషయాన్ని దాచే ప్రయత్నం చేశారు.. ఇప్పటికే ఆస్పత్రిలో ఎక్కడ కూడా కిడ్నీ మార్పిడి సర్జరీ జరిగినట్టుగా రాతపూర్వకంగా ఆధారాలు లేకుండా జాగ్రత్త పడ్డారని డీఎం అండ్ హెచ్‌వో పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృత్తం కాకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. ప్రాణాలతో చెలగాటం ఆడుతూ ఇలాంటి సర్జరీలు చేయడంపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు. త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసాం.. పూర్తి స్థాయి రిపోర్ట్ ప్రభుత్వానికి అందజేస్తామని డీఎం అండ్ హెచ్‌వో పేర్కొన్నారు.