హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో గొడవ జరిగింది. యూత్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కొత్తగూడెం నేతలకు పోస్టులు ఇవ్వడంపై స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడ ఉన్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. యూత్ కాంగ్రెస్ రెండు వర్గాల మధ్య తన్నులాట వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ సమావేశం కొనసాగుతుంది.