హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో గొడవ జరిగింది. యూత్ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన కొత్తగూడెం నేతలకు పోస్టులు ఇవ్వడంపై స్థానిక నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలి సమావేశం జరిగింది. కమిటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి అధ్యక్షతన ఆయన నివాసంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. రైతు ఆత్మహత్యలు, అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అమలుపై చర్చించారు.
ఈ నెల 28న నల్గొండలో బీఆర్ఎస్ (BRS) రైతు మహా ధర్నా నిర్వహించనుంది. అయితే.. ఈ నెల 21న నల్గొండలో రైతు మహా ధర్నాకు బీఆర్ఎస్ పిలుపునివ్వగా.. పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ధర్నాకు అనుమతి నిరాకరణ అంశంపై బీఆర్ఎస్ పార్టీ పెద్దలతో చర్చించారు. అనుమతి నిరాకరణపై బీఆర్ఎస్ నేతలు సోమవారం(20వ తేదీ)న హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ధర్మాసనం ఈరోజు.. ధర్నాకు షరతులతో కూడిన అనుమతినిచ్చింది.
హైదరాబాద్‌లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై ప్రభుత్వం సీరియస్ అయింది. సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజానిర్దారణ కమిటీ వేసింది. దీంతో.. కమిటీ గాంధీ ఆసుపత్రికి రానుంది. కిడ్నీ రాకెట్ ప్రధాన సూత్రదారులపై నిజానిజాలు తెలుసుకునేందుకు కమిటీని నియమించింది ప్రభుత్వం.
ఆర్చర్ చికితకు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు చేయూత అందించేందుకు ముందుకొచ్చారు. అక్షర విద్యాసంస్థల నుంచి 10 లక్షల స్పోర్ట్స్ స్కాలర్షిప్ అందించారు. ఆర్చరీ వరల్డ్‌కప్, ఆసియాకప్‌కు ఎంపికైన పెద్దపల్లి యువ ఆర్చర్ టి.చికితరావుకు జగన్ మోహన్ రావు చేయూత అందించారు.
కృష్ణా జలాల వాటాపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలు చెబుతున్నది పచ్చి అబద్ధం అని తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ తేల్చేసారని హరీష్ రావు ఆరోపించారు.
హైదరాబాద్‌లో మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్ అయ్యాడు. హత్యాయత్నం కేసులో మొయినాబాద్ పోలీసులకు చిక్కాడు క్రిమినల్ సయ్యద్ బుర్హానుద్దీన్.. అతని వద్ద నుంచి బెంజ్ కారు, క్రికెట్ బ్యాట్, ఐరన్ రాడ్, 25 హాకీ స్టిక్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు పోలీస్ స్టేషన్లలో 14 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ సోకాల్డ్ ప్రజాపాలన పట్ల ప్రజలు ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇప్పటికైనా అర్థమైందా..? అని దుయ్యబట్టారు. మీరు ఎంతో ఆడంబరంగా నిర్వహిస్తున్న గ్రామ సభల సాక్షిగా మీ ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత తేటతెల్లమైందని హరీష్ రావు ఆరోపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ రెండో రోజున వరుసగా వివిధ కంపెనీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు సాంబానోవా కంపెనీ చీఫ్ గ్రోత్ ఆఫీసర్ సూలేతో చర్చలు జరిపారు. ప్రధానంగా తెలంగాణలో సెమీ కండక్టర్ పరిశ్రమలకు సంబంధించిన పెట్టుబడుల అవకాశాలపై చర్చించారు.