అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్ వార్తపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం చేసింది. బాధ్యులైన వైద్యులపై చర్యలకు రంగం సిద్ధం చేసింది. అక్రమ కిడ్నీ రాకెట్ మార్పిడిపై సుమోటోగా స్వీకరించి విచారణ చేయనున్నట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) ప్రకటించింది. మరోవైపు.. అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్‌కు సంబంధించిన అలకనంద హాస్పిటల్ వైద్యులపై టీజీఎంసీ చైర్మన్ డా. మహేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: SS Thaman: థమన్ దెబ్బకి కొత్త ఉద్యోగం పుట్టిందిగా!
టీజీఎంసీ వైస్ చైర్మన్ డా. శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కి న్యాయస్థానాన్ని పోలి ఉండే అధికారాలు కలిగి ఉన్నాయని.. అక్రమ కిడ్నీ మార్పిడి కుంభకోణంలో ఉన్న వైద్యులపై ప్రభుత్వ, పోలీస్ సహకారంతో ఎతికల్, మాల్ ప్రాక్టీసెస్ కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిపి బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి చేయడం, లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం, నకిలీ వైద్యులను ప్రోత్సహించడం చట్ట విరుద్ధమైన చర్యలు అని.. అందుకు బాధ్యులు అయినా వైద్యులను అవసరం అయితే శాశ్వతంగా మెడికల్ కౌన్సిల్ రిజిస్టర్ నుండి తొలగిస్తామని.. అలాంటి వైద్యులు వైద్య పరంగా ఎటువంటి సేవలు అందించలేరని పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా. నరేష్ కుమార్ పేర్కొన్నారు.
Read Also: IND vs ENG: అర్ష్‌దీప్ సింగ్ ఆట అదుర్స్.. యువ క్రికెటర్ పేరిట కొత్త రికార్డు