Home
Telugu News
Telugu News News
-
Top Headlines @5PM : టాప్ న్యూస్
రంగారెడ్డిలో దారుణం.. ఇద్దరిపై పిచ్చికుక్కల దాడి..! రంగారెడ్డి జిల్లాలో పిచ్చికుక్కల స్వైర విహారం రోజు రోజుకూ ఎక్కువగా మారుతుంది. మంచాల మండలంలో చిన్నపిల్లలపై, మహిళలపై విచక్షణా రహితంగా కుక్కలు దాడి చేస్తున్నాయి. ఉదయం నడుకుంటూ పోతున్న ఓ మహిళ, ఓ బాలుడి పై దాడి చేసి వారిపై కండలు పీక్కుతిన్నాయి. వారిద్దరూ గట్టిగా కేకలు వేయడంతో అక్కడకు స్థానికులు చేరుకుని కుక్కను తరుముతున్న కుక్కలు దాడి మాత్రం ఆపలేదు. ఓ బాలుడి చేతికి, మహిళలకు కాళ్ల కండరాలను… -
Saina Nehwal: కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి మండిపాటు..
మహిళలు వంటగదికే పరిమితం అవ్వాలన్న కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే శివశంకరప్ప వ్యాఖ్యలపై బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ మండిపడ్డారు. అమ్మాయిలు పోరాడగలరనే పార్టీ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదు. నేను భారత్ కు పతకాలు సాధించినప్పుడు కాంగ్రెస్ ఏం ఆలోచించి ఉంటుంది..? ప్రధాని మోడీ నేతృత్వంలో మహిళా రిజర్వేషన్ బిల్లు వచ్చినా.. స్త్రీద్వేష వ్యక్తుల నుంచి అవమానం జరుగుతోంది. ఇది నిజంగా బాధాకరం అని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
Chandrababu: వాలంటీర్లను తొలగించబోం.. నాయుడుపేట సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. అన్ని పార్టీల నేతలు తమ ప్రచారాన్ని జోరుగా సాగిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజాగళం పేరుతో ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. తిరుపతి జిల్లా నాయుడుపేట ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రసంగించారు.సూళ్లూరుపేటలో టీడీపీ గాలి వీస్తోందన్న ఆయన.. జగన్‌కు ఓటు వేసినందుకు ఆయన ప్రజలను మోసగించారని విమర్శించారు. -
Konda Vishweshwar Reddy : మోడీ ఉచిత బియ్యం ఇస్తే.. తాను ఇచ్చినట్లు చెప్పాడు కేసీఆర్
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం దోమ, మండలంలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజాసంకల్పయాత్ర మూడోరోజు కొనసాగింది. ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ ఏమి చేయలేదని దుష్ప్రచారాలు చేశారు కేసీఆర్ అంతా మేమే ఇస్తున్నామని దుష్ప్రచారం చేశారన్నారు. ఉచిత బియ్యం కూడా నేనే ఇస్తున్నానని ప్రచారం చేశాడు కేసీఆర్ అని ఆయన విమర్శించారు. రైతులకు మద్దతు ధర నేనే పంపిస్తాను అన్నాడని, స్థంబాలకు లైట్ బుగ్గలు నేనే ఇస్తున్న అన్నాడు… -
Madhya Pradesh: నేను చలాన్ కట్టను, ఎస్పీకి చెప్పండి.. మహిళా ఇన్స్పెక్టర్తో ఓ వ్యక్తి వాగ్వాదం
మహిళా ఇన్స్పెక్టర్తో ఓ బడా వ్యాపారవేత్త వాగ్వాదానికి పాల్పడ్డ ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. నిబంధనలు ఉల్లంఘించి పోలీసులపై బెదిరింపులకు పాల్పడుతున్నారు. కాగా.. మహిళా సబ్ఇన్స్పెక్టర్, వ్యాపారవేత్త మధ్య జరిగిన వాగ్వాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఆధారంగా పోలీసులు అతనిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. -
Pithani Balakrishna: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పితాని బాలకృష్ణ
బస్సు యాత్ర సందర్భంగా పలు పార్టీలకు చెందిన అసంతృప్త నేతలు వైసీపీలో చేరుతున్నారు. తాజాగా.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గం జనసేన కో-ఆర్డినేటర్‌గా ఉన్న పితాని బాలకృష్ణ.. సీఎం జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. -
Virat Kohli: కోహ్లీ ఖాతాలో మరో రికార్డు..!
శుక్రవారం కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్ కోహ్లీ రికార్డుల సునామీ సృష్టించాడు. కేకేఆర్ తో మ్యాచ్ లో 83 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.. కాగా.. ఆ పరుగులతో మరో వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒకే వేదికలో అత్యధిక టీ20 రన్స్ (3,276) చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచాడు. అయితే.. ఇంతకుముందు ఈ రికార్డు బంగ్లాదేశ్ వికెట్ కీపర్ బ్యాటర్ ముష్ఫికర్ రహీం పేరిట… -
YSRCP: వైసీపీలోకి కళ్యాణ దుర్గం టీడీపీ ఇంచార్జ్ ఉమామహేశ్వర నాయుడు
ఓ వైపు జోరుగా ఎన్నికల ప్రచారం.. మరో వైపు చేరికలతో ఉత్సాహంగా సాగుతోంది మేమంతా సిద్ధం బస్సు యాత్ర. నాలుగో రోజు కర్నూలు జిల్లాలో బస్సు ఉత్సాహం కొనసాగింది. బస్సు యాత్ర సందర్భంగా పలువురు కళ్యాణదుర్గం టీడీపీ నేతలు, కార్యకర్తలు సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. -
Bandi Sanjay : ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలను చంపేద్దామనుకుంటున్నారా?
ప్రైవేట్ డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కాలేజీలను చంపేద్దామనుకుంటున్నారా? 3 ఏళ్లుగా రూ.7 వేల 800 కోట్ల ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలా? విద్యార్థులను రోడ్డున పడేస్తారా? అని ప్రశ్నించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, వ్రుత్తి విద్యా కళాశాలల పరిస్థితి దుర్భరంగా మారింది. దీనికి ప్రధాన కారణం ఫీజు రీయంబర్స్ మెంట్ట్ చెల్లింపుల్లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న… -
Shaheen Afridi: కెప్టెన్సీకి అఫ్రిదీ గుడ్ బై..?
పాకిస్తాన్ టీ20 కెప్టెన్ షాహీన్ షా అఫ్రిదీ తన కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం తెలుస్తోంది. కాగా.. తన కెప్టెన్సీలో పాకిస్తాన్ ఘోర ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ.. ఆయన వైదొలుగుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయనకు పీసీబీ (PCB) ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా.. పాకిస్తాన్ కెప్టెన్ గా మళ్లీ బాబర్ ఆజమ్ పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. న్యూజిలాండ్ తో జరగబోయే టీ20 సిరీస్ కు ఆయనకు బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు టాక్…
తాజావార్తలు
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?