తన పంచాయతీని పట్టి పీడిస్తున్న కోతుల వివాదాన్ని పరిష్కరించేందుకు జిల్లాలోని ఓ గ్రామ పంచాయతీ కార్యదర్శి వినూత్నమైన పరిష్కారాన్ని కనిపెట్టారు. ఈ ఆలోచన ఇప్పుడు వైరల్‌గా మారింది. రాష్ట్రంలోని అనేక ఇతర గ్రామాలు, పట్టణాల మాదిరిగానే, కొత్తగూడెం జిల్లాలో బూర్గంపహాడ్ మండలంలోని మోరంపల్లి బంజర్ గ్రామ పంచాయతీ నివాసితులు ఇళ్ల చుట్టూ తిరుగుతూ, మొక్కలను ధ్వంసం చేయడం, తినుబండారాలను తీయడం.. వారి వ్యవసాయ పొలాల్లోని పంటలను కూడా నాశనం చేయడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కోతులను తరిమికొట్టడానికి…
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగు చూసింది. ముంబయిలోని మాల్వానీ ప్రాంతంలో రుతుక్రమం గురించి అవగాహన లేని ఓ మైనర్ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. మొదటి సారి పీరియడ్‌తో ఒత్తిడికి లోనైన ఆమె కేవలం 14 ఏళ్ల వయసులోనే ఆత్మహత్యకు పాల్పడింది. మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం రసూల్‌పురాలో జరిగిన ఇఫ్తార్ కార్యక్రమానికి హాజరయ్యారు. పార్టీ మల్కాజిగిరి లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి రాగిడి లక్ష్మా రెడ్డితో కలిసి స్థానికులతో మాట్లాడారు. ‘రసూల్‌పురా యువసేన’ అనే సంస్థ ఇఫ్తార్ కార్యక్రమాన్ని నిర్వహించింది. మైనారిటీ కమ్యూనిటీ యువత కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబసభ్యులు, యువకులు, పిల్లలతో సహా ప్రజలతో కేటీఆర్ సంభాషించారు, వారు ఉత్సాహంగా కేటీఆర్‌తో సెల్ఫీలు తీసుకున్నారు. ఇఫ్తార్‌లో పాల్గొన్న కేటీఆర్‌కు రసూల్‌పురా యువసేన సభ్యులు…
ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరును నమోదు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్. ఇంతకుముందు ఆర్సీబీ (263) పరుగులు చేసింది. ఇప్పుడా రికార్డును సన్ రైజర్స్ బ్రేక్ చేసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ లో ఓపెనర్లు ట్రేవిస్ హెడ్ (62) పరుగులతో ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. మయాంక్ అగర్వాల్ (11) పరుగులు…
ముఖ్యమంత్రి సహాయనిధి ( సీఎంఆర్ఎఫ్ ) చెక్కులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణల నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టీ హరీశ్‌రావు కార్యాలయం తన ప్రమేయాన్ని ఖండించింది. తనకు సంబంధం ఉన్న వ్యక్తుల ద్వారా చెక్కులను క్యాష్ చేశారనే వార్తలపై హరీష్ రావు కార్యాలయం స్పందిస్తూ, నిందితుడు నరేష్‌కు మాజీ మంత్రితో ప్రత్యక్ష సంబంధం లేదని స్పష్టం చేసింది. డిసెంబర్ 6, 2023న తన మంత్రి క్యాంపు కార్యాలయం కార్యకలాపాలు నిలిపివేసినట్లు హరీష్ రావు కార్యాలయం ఒక…
జనసేన శ్రేణులు పొత్తు ధర్మాన్ని గౌరవిస్తున్నందుకు సంతోషంగా ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఎవరైనా పొత్తు ధర్మానికి భిన్నంగా.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎక్కడా పొరపాట్లకు, లోటుపాట్లకు తావివ్వకుండా మూడు పార్టీలూ క్షేత్ర స్థాయి నుంచి ముందుకు వెళ్ళాలని సూచించారు.
ఐపీఎల్ 2024లో భాగంగా.. సన్ రైజర్స్ హైదరాబాద్-ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించారు. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్ (11) పరుగులు చేసి ఔట్ కాగా... మరో బ్యాటర్ ట్రేవిస్ హెడ్ కేవలం 24 బంతుల్లో 62 పరుగులు చేశారు.
ప్రభుత్వం మొత్తం 614 ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ ఇఛ్చింది. 555 అభ్యర్థులు సెలెక్టయ్యారు. ఫిబ్రవరి 14న ఎంపికైన ఎక్సైజ్ కానిస్టేబుళ్ల కు ప్రభుత్వం అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చింది. ఏప్రిల్ 13వ తేదీ వరకు జాయినింగ్ టైమ్ ఇచ్చింది. సెలెక్టయిన 555 మంది అభ్యర్థుల్లో ఇప్పటివరకు 397 మంది జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. వీరందరూ 3 నెలల పాటు శిక్షణ పొందాల్సి ఉంటుంది. 45 రోజులు ఫీల్డ్ ట్రైనింగ్ ఉంటుంది. 120 మంది అభ్యర్థులకు ఎక్సైజ్…
క్రికెట్ దిగ్గజం.. సచిన్ టెండూల్కర్ కేరీర్ మలుపు తిరిగిన రోజు ఈరోజే (మార్చి 27, 1994). ముప్పేళ్ల క్రితం ఇదే రోజు క్రికెట్ దేవుడిగా అవతరించాడు. టీమిండియా న్యూజిలాండ్ తో మ్యాచ్ ఆడుతున్న సమయంలో.. ఇండియా రెగ్యూలర్ ఓపెనర్ నవజోత్ సింగ్ సిద్ధూ ఆ మ్యాచ్ కు దూరమయ్యాడు. అంతలో కెప్టెన్ అజారుద్దీన్.. ఓపెనింగ్ బ్యాటింగ్ చేయాలని సచిన్ టెండుల్కర్ కు చెప్పాడు. దీంతో.. ఆ పిలుపే సచిన్ కెరీర్ ను మలుపు తిప్పింది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సీతారాంపురం మండలం అయ్యవారిపల్లి గ్రామ సమీపంలో జగన్మాత ఈశ్వరీ దేవి ఆలయంలో దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు.